‘సినిమా (Movies) తీయడం ఈజీ.. కానీ సినిమాని రిలీజ్ చేయడం కష్టం’ అని ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు చెబుతూ ఉంటారు. వాళ్ళు చెప్పింది నిజమే. సినిమాని రిలీజ్ చేయడమే మొదటి సక్సెస్. షూటింగ్ కంప్లీట్ అయినా రిలీజ్ కాని సినిమాలు ఎన్నో ఉన్నాయి. గతంలో చూసుకుంటే పెద్ద హీరోల సినిమాలు కూడా అతి కష్టం మీద రిలీజ్ అయ్యాయి. కొన్నేళ్ల పాటు రిలీజ్ కి నోచుకోని పెద్ద సినిమాల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) దర్శకత్వంలో ‘అంజి’ అనే సినిమా రూపొందింది. ‘ఎం.ఎస్.ఆర్ట్స్’ బ్యానర్ పై శ్యామ్ ప్రసాద్ రెడ్డి (Shyam Prasad Reddy) ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా మొదలైన 7 ఏళ్ళ తర్వాత ఈ సినిమా రిలీజ్ అయ్యింది. షూటింగ్ దాదాపు 4 ఏళ్ళు జరిగింది. బడ్జెట్ అయితే ఆ రోజుల్లోనే రూ.26 కోట్లు బడ్జెట్ పెట్టి ఈ సినిమాను నిర్మించారు. మొత్తానికి 2004 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద ప్లాప్ గా మిగిలిపోయింది.
2) అన్వేషణ :
రవితేజ (Ravi Teja) హీరోగా రాధిక వర్మ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ఇది. సాగర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 3 ఏళ్ళ తర్వాత రిలీజ్ అయ్యింది. ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ (Itlu Sravani Subramanyam) ‘ఇడియట్’ (Idiot) వంటి సినిమాలతో రవితేజ క్రేజ్ పెరగడం వల్ల.. హడావిడిగా ఈ సినిమాని 2002 డిసెంబర్ 27న రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.
నిఖిల్ (Nikhil Siddhartha) హీరోగా సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. 2017 టైంలో మొదలైన ఈ ప్రాజెక్టు దాదాపు 7 ఏళ్ళ తర్వాత అంటే 2024 నవంబర్ 8న రిలీజ్ అయ్యింది. షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వకుండానే ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఇక టాక్ కూడా నెగిటివ్ గానే వచ్చింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.
నాని (Nani) హీరోగా అమలా పాల్ (Amala Paul) హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ఇది. సముద్రఖని (Samuthirakani) దీనికి దర్శకుడు. 2012 టైంలో మొదలైన ఈ సినిమా పలు కారణాల వల్ల చాలా డిలే అయ్యింది. మొత్తానికి అందరూ మర్చిపోయిన టైంలో ఈ చిత్రాన్ని 2015 మార్చి నెలలో రిలీజ్ చేశారు. అయినా ఫలితం మారలేదు. విచిత్రం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ రోజునే నాని నటించిన మరో సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ (Yevade Subramanyam) కూడా రిలీజ్ అయ్యింది.
కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా మల్లికార్జున్ దర్శకత్వంలో ‘అభిమన్యు’ (Abhimanyu) ‘కత్తి’ (Kathi) వంటి ప్లాప్ సినిమాలు వచ్చాయి. అయినప్పటికీ వీళ్ళు కలిసి ‘షేర్’ అనే సినిమా చేశారు. చాలా ఏళ్ళు మూలాన పడి ఉన్న ఈ సినిమాని ‘పటాస్’ (Pataas) సూపర్ హిట్ అవ్వడంతో.. రిలీజ్ చేశారు. బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేసినా.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిలబడలేకపోయింది.
రానా (Rana Daggubati) హీరోగా సత్య శివ (Sathyasiva) దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇది. రెజీనా (Regina Cassandra) హీరోయిన్ గా నటించగా.. ఎస్.ఎన్.రంజన్ (S. N. Rajarajan) ఈ చిత్రాన్ని నిర్మించారు. కానీ ఫైనల్ గా సి.కళ్యాణ్ బ్రాండ్ తో ఈ సినిమా 2022 సంక్రాంతి టైంలో రిలీజ్ అయ్యింది. సరిగ్గా షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వకుండా.. ఏళ్ళ తర్వాత ఈ సినిమాని రిలీజ్ చేశారు. మొదటి షోతోనే డిజాస్టర్ లిస్టులోకి చేరిపోయింది ఈ సినిమా.
నితిన్ (Nithin Kumar) హీరోగా మీరా చోప్రా (Meera Chopra) హీరోయిన్ గా రూపొందిన సినిమా ఇది. మలయాళ దర్శకుడు సిద్ధికి (Siddique) డైరెక్ట్ చేసిన సినిమా ఇది.2006 లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఫైనల్ గా 2011 లో రిలీజ్ అయ్యింది. సల్మాన్ ఖాన్ తో (Salman Khan) సిద్దికీ చేసిన ‘బాడీ గార్డ్’ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ‘మారో’ ని రిలీజ్ చేసి క్యాష్ చేసుకుందామనుకున్నారు నిర్మాతలు. కానీ వారి ఆశలు ఫలించలేదు. సినిమా డిజాస్టర్ అయ్యింది.
8) అర్జున :
రాజశేఖర్ (Rajasekhar) హీరోగా కన్మణి దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. చాలా ఏళ్ళ పాటు ఈ సినిమా విడుదల ఆగిపోయింది. మొత్తానికి 2020 లో రిలీజ్ చేశారు. కానీ రిలీజ్ చేసినట్లు కూడా చాలా మందికి తెలీదు. యూట్యూబ్ వంటి ప్లాట్ ఫామ్స్ లో కూడా ఈ సినిమా అందుబాటులో లేకపోవడం గమనార్హం.
గోపీచంద్ (Gopichand) హీరోగా బి.గోపాల్ (B. Gopal) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. నయనతార (Nayanthara) హీరోయిన్. 2010 లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఆర్థిక సమస్యల కారణంగా చాలా ఏళ్ళ పాటు రిలీజ్ కాలేదు. 2021 లో రిలీజ్ చేశారు. కానీ ప్రేక్షకులను ఈ సినిమా థియేటర్లకు రప్పించలేదు. సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.
విశాల్ (Vishal) హీరోగా సుందర్ సి (Sundar C) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. అంజలి (Anjali) , వరలక్ష్మీ (Varalaxmi Sarathkumar) హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఎప్పుడో 2012 లో రిలీజ్ కావాలి. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ కాలేదు. ఇక రిలీజ్ కాదు అని అంతా ఫిక్స్ అయిపోయిన టైంలో జనవరి 12న తమిళంలో రిలీజ్ చేశారు. అక్కడ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి రూ.50 కోట్లు కలెక్ట్ చేసింది. జనవరి 31న తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది.
ఇవి మాత్రమే కాదు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ‘రేయ్’ (Rey), నాగ చైతన్య (Naga Chaitanya) ‘ఆటో నగర్ సూర్య’ (Autonagar Surya) వంటి సినిమాలు కూడా చాలా ఆలస్యంగా రిలీజ్ అయ్యాయి. అవి కూడా ఫ్లాప్ అయ్యాయి.