సంక్రాంతి పండుగ అంటే సినిమాల పండుగే. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి పండుగ టైంలో రిలీజ్ అయ్యే సినిమాలు ఎగబడి చూస్తుంటారు. నార్మల్ సీజన్లో సినిమా ప్లాప్ అయితే.. ఈ సీజన్లో ప్లాప్ సినిమా యావరేజ్ అవుతుంది. అలాగే యావరేజ్ సినిమా హిట్ సినిమా అవుతుంది. ఇక హిట్ సినిమా బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది. అలా అని మరీ ఈ సీజన్ కి మ్యాచ్ అవ్వని సినిమాలు కనుక రిలీజ్ అయితే మొదటికే మోసం వస్తుంది.
Venkatesh
ఈ విషయంలో వెంకటేష్ ని (Venkatesh Daggubati) బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉండే క్రేజే వేరు. సంక్రాంతి సీజన్లో వెంకటేష్ సినిమా రిలీజ్ అయితే కచ్చితంగా బ్లాక్ బస్టరే అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోతారు. అందుకే దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఓ డైలాగ్ కూడా పెట్టేశాడు. ‘హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ప్రతిసారీ విక్టరీనే’ అని..!
అలా అని ‘దేవీపుత్రుడు’ (Devi Putrudu) ‘సైందవ్’ (Saindhav) వంటి ప్రయోగాత్మక సినిమాలతో వస్తే.. డిజాస్టర్లు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే వెంకటేష్ ఫ్యామిలీ సినిమాతో సంక్రాంతికి వస్తున్నాడు అంటే ఇప్పటికీ భారీ డిమాండ్ ఏర్పడుతుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాని చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసి..
రీజనల్ మూవీస్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) సినిమా కలెక్షన్స్ ను అధిగమించి ఈ సినిమా ఆ ఫీట్ ను సాధించింది. దీంతో వెంకటేష్ ఖాతాలో మూడో ఇండస్ట్రీ హిట్ వచ్చి చేరింది. గతంలో 1992 లో వచ్చిన ‘చంటి’ (Chanti), 2000 లో వచ్చిన ‘కలిసుందాం రా’ (Kalisundam Raa) వంటి సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం వెంకటేష్ కెరీర్లో మూడో ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచింది. సో సంక్రాంతికి వెంకటేష్ (Venkatesh) ఫ్యామిలీ సినిమాలతో వస్తే ఇప్పటికీ తిరుగులేదు అని అర్ధం చేసుకోవచ్చు.