‘అఖండ’తో హ్యాట్రిక్‌తో ‘సింహా’, ‘లెజెండ్’ లను మించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు నటసింహ నందమూరి బాలకృష్ణ.. ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ఈ మూవీతో కెరీర్‌లో హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టాడు బాలయ్య.. సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో బాక్సాఫీస్ బరిలో తన సింహగర్జన ద్వారా చూపించడమే కాక.. పాండమిక్ తర్వాత ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకొచ్చేాలా చేసి.. విడుదల వాయిదాలతో సతమతమవుతున్న తెలుగు చిత్రసీమకి సరికొత్త ఊపునీ, ఉత్సాహాన్నీ ఇచ్చారు..
‘అఖండ’ గా బాలయ్య నటవిశ్వరూపాన్ని చూడ్డానికి పల్లెటూళ్ళల్లో ట్రాక్టర్లు వేసుకుని మరీ వచ్చిన ప్రేక్షకాభిమానులతో జాతర వాతావరణాన్ని తలపించాయి సినిమా హాళ్లు.. తెలుగు ఇండస్ట్రీ చాలా రోజుల తర్వాత 50 రోజుల పోస్టర్ చూసింది ఈ చిత్రంతోనే.. ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తే.. ఊళ్ళల్లో స్క్రీన్స్ వేసుకుని మరీ చూశారంటే ఇక క్రేజ్ పిచ్చ పీక్స్ అని చెప్పడం కూడా తక్కువే.. ఇటీవలే 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘చెన్న కేశవరెడ్డి’ రీ రిలీజ్ చేస్తే ఎలాంటి హైప్ వచ్చిందో తెలిసిందే..
ఇప్పుడు మరోసారి థియేటర్లలో ‘అఖండ’ హంగామా కొనసాగుతోంది.. ప్రస్తుతం సరైన సినిమాలు లేక థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, కృష్ణాజిల్లాలో కొన్ని ఏరియాల్లో (దాదాపు 15 స్క్రీన్స్) ‘అఖండ’ మూవీని రీ రిలీజ్ చేశారు. విచిత్రం ఏంటంటే.. ఓటీటీ, టీవీలో వచ్చినా కానీ.. గతేడాది డిసెంబర్ 2న వచ్చిన ఈ సినిమాని దాదాపు సంవత్సరం తర్వాత రీ రిలీజ్ చేసినా కూడా ఫ్యాన్స్, ఆడియన్స్ థియేటర్లకి వచ్చారు..
దీని గురించి డిస్ట్రిబ్యూటర్, థియేటర్ ఓనర్స్.. ‘‘ఇప్పుడున్న థియేటర్లలోనే నాలుగున్నర నుండి ఐదు లక్షల వరకు గ్రాస్ వసూలు చేసింది.. ఇదేమంత భారీ లాభాలు తెచ్చిపెట్టే ఫిగర్ కాదు కానీ.. థియేటర్ రెంట్, ఇతరత్రా మెయింటినెన్సులు లాంటివి పోగా.. కొంతలో కొంత మిగిలుతుంది.. కొత్త సినిమాలు వచ్చే వరకు.. ఇలా రీసెంట్ హిట్స్, ఓల్డ్ మూవీస్ రీ రిలీజ్ చేయడం మంచి పరిణామం.. ఇవి చాలా వరకు థియేటర్ ఫీడింగ్‌కి ఉపయోగపడుతున్నాయి’’ అంటున్నారు..