ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్య థియేటర్‌లో ఘోరమైన దుర్ఘటన చోటు చేసుకుంది. ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2: The Rule) ప్రీమియర్ షో కోసం తన ఇద్దరు పిల్లలతో ఓ మహిళ వెళ్ళింది. అయితే అక్కడకి అల్లు అర్జున్ (Allu Arjun) తన ఫ్యామిలీతో రావడంతో జనాలు ఒక్కసారిగా గుమిగూడటం జరిగింది. దీంతో తొక్కిసలాటలు తలెత్తాయి. ఈ క్రమంలో ఆ మహిళ గాయపడింది. తర్వాత చికిత్స అందించినా లాభం లేకుండా పోయింది. ఈ సంఘటన అందరినీ కలచివేసింది అని చెప్పాలి.
Allu Arjun
దీంతో థియేటర్ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక దీంతో తొక్కిసలాటలో మృతి చెందిన అమ్మాయి పేరు రేవతి అని, ఆమె కొడుకు పేరు శ్రీతేజ అని తెలుస్తుంది. అల్లు అర్జున్ ఆ థియేటర్ కి వెళ్తున్నాడు అనే సంగతి పోలీసులకి ముందుగా తెలీదట. దాని వల్లే ఈ విషాదం చోటు చేసుకున్నట్టు కూడా స్పష్టమవుతుంది.
సంధ్య థియేటర్ సంఘటనపై, అలాగే రేవతి మృతిపై అల్లు అర్జున్ (Allu Arjun) టీం స్పందించింది. ‘సంధ్య థియేటర్ వద్ద నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాట దురదృష్టకరం.. మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం’ అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ తెలియజేసింది.
ఈ మధ్య హైదరాబాద్ వంటి నగరాల్లో పెద్ద సినిమాల బెనిఫిట్ షోలకి అనుమతులు ఇవ్వడం లేదు. ఇలాంటి తొక్కిసలాటలు వంటివి జరుగుతున్నాయి అని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉండే జనాలు.. సినిమాలు ఎక్కువగా చూస్తుంటారు. సరైన ప్లానింగ్ లేదు అంటే ఇలాంటి ఘోరమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి.