మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కొత్త సినిమా షూటింగ్‌కు రంగం సిద్ధమవుతోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’తో (Sankranthiki Vasthunam) బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు చిరంజీవితో హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుండటంతో చిరంజీవి నుంచి మళ్లీ పాత చలాకీ, కామెడీ టచ్ చూడబోతున్నామన్న అనందం ఫ్యాన్స్‌లో కనిపిస్తోంది. ఇక ఈ సినిమా మేకింగ్ విషయంలో అనిల్ రావిపూడి (Anil Ravipudi) తనదైన ప్లాన్ అమలు చేస్తుండటమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ప్రీ ప్రొడక్షన్ దశలోనే 95 శాతం స్క్రిప్ట్ ఫిక్స్ చేసుకునే అనిల్, షూటింగ్ సమయంలో టైమ్ వేస్ట్ లేకుండా ప్లాన్ చేసుకుంటాడు. ఎక్కువ ఫుటేజ్ తీసి ఎడిటింగ్‌లో కట్ చేసే టెక్నిక్‌కు బదులు, డైరెక్ట్‌గా అవసరమైన సీన్స్ మాత్రమే పూర్తి చేస్తాడు. దీంతో అనవసర ఖర్చులతో బడ్జెట్ పెరగకుండా, సినిమా కంట్రోల్‌లో ఉంటుంది. గత చిత్రాలూ ఇదే పద్ధతిలో నిర్మించబడి, నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి. అయితే ఇదే అనిల్ స్టైల్ చిరంజీవి సినిమాపైనా వర్తిస్తే ఫ్యాన్స్‌కు మాత్రం కాస్త మిక్స్‌డ్ ఫీలింగ్స్ వచ్చాయి. మెగాస్టార్ సినిమా అంటే విపరీతమైన గ్రాండియర్ మేకింగ్, భారీ సెట్స్, మాస్ ఎలిమెంట్స్ ఆశించడమే అలవాటు.
అలాంటి లోటు ఉంటుందేమోనన్న టెన్షన్ ఫ్యాన్స్‌లో మొదలైంది. అయితే కొన్ని వర్గాలు మాత్రం బడ్జెట్ వృథా కాకుండా, స్టోరీకు తగ్గ మేకింగ్ ఉంటే చాలని అంటున్నారు. అదనపు ఖర్చులు పెట్టకుండానే హిట్ ఇవ్వడం అనిల్‌కు కొత్త కాదు కాబట్టి ఫైనల్ అవుట్‌పుట్‌పై నమ్మకం పెట్టుకోవాలంటూ మరికొందరు భిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక బడ్జెట్ విషయానికొస్తే, చిరు-అనిల్ రావిపూడి రెమ్యునరేషన్ భారీగా ఉన్నా మిగతా టెక్నికల్ టీమ్, నటీనటుల పారితోషికాలను నామమాత్రంగా ఉంచబోతున్నారని టాక్.
మేకింగ్‌లోనూ అవసరమైన జాగ్రత్తలు తీసుకొని సినిమాను చాలా స్మార్ట్‌గా కంప్లీట్ చేయాలనే ప్లాన్ ఉందట. సుస్మిత కొణిదెల (Sushmita Konidela)-సాహు గారపాటి (Sahu Garapati) నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనుండగా, వచ్చే సమ్మర్ తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి.. మెగా ఫ్యాన్స్ ఆశలు, అనిల్ రావిపూడి స్ట్రాటజీ.. రెండూ వేరే పథాల్లో నడుస్తున్నా, ఫైనల్ అవుట్‌పుట్ ఎలాంటి మాస్ ఎంటర్‌టైనర్‌గా వస్తుందనేది ఆసక్తిగా మారింది. 2026 సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.