Bigg Boss 5 Telugu: ఎలిమినేషన్ లో సరయుకి పవర్ ఇస్తే ఎవరిపై వేసేది..?
- September 13, 2021 / 11:53 AM ISTByFilmy Focus
బిగ్ బాస్ హౌస్ లో మొదటివారం ఎలిమినేషన్ చాలా ఉత్కంఠంగా జరిగింది. లాస్ట్ లో మిగిలిన జెస్సీ ఇంకా సరయుల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని హౌస్ మేట్స్ చాలా ఆసక్తికరంగా చూశారు. జెస్సీ సేఫ్ అయ్యేసరికి వెంటనే వెళ్లి సిరి జెస్సీని కౌగిలించేసుకుంది. జెస్సీ సేఫ్ అయ్యాడని ఆనందం ఒకవైపు ఉంటే, తనని ఏడిపించిన సరయు వెళ్లిపోతోందనే ఆనందం మరోవైపు ఉంది. ఇక సరయు వెళ్లిపోతూ 5గురు బెస్ట్ పెర్ఫామర్స్ ని , అలాగే 5గురు వరెస్ట్ పెర్ఫామర్స్ ని ఎంచుకుంది.
తనకి ఏది అనిపించిందో అదే మాట్లాడింది. అయితే, ఇక్కడ ఈసారి బిగ్ బాస్ ఎందుకో ఎలిమినేట్ అయిన సరయుకి బిగ్ బాంబ్ వేసే అవకాశం ఇవ్వలేదు. అంతేకాదు, నాగ్ సెల్ఫీ దిగడం కూడా మర్చిపోయారు. హౌస్ మేట్స్ కూడా సెల్పీ దిగినట్లుగా చూపించలేదు. ఇక నెటిజన్స్ దీనిపై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. బిగ్ బాంబ్ ఏది బాసూ అంటూ సెటైర్లు మొదలుపెట్టారు. ఒకవేళ బిగ్ బాంబ్ సరయుకి ఇచ్చి ఉంటే ఎవరిపైన వేసేది అనేది ఇంట్రస్టింగ్ గా మారింది.

సరయుకి ఈవారం ఎవరినైనా నేరుగా నామినేట్ చేసే బిగ్ బాంబ్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా సన్నీని కానీ, షన్నూని కానీ చేసి ఉండేది. అంతే నామినేషన్స్ నుంచీ ఒకరిని సేఫ్ చేయచ్చు అంటే మాత్రం విశ్వని కానీ, హమీదని కానీ చేసేది. ఇక సరయుకి విశ్వకి ఉన్న బాండింగ్ ఏంటి అనేది కూడా ఎలిమినేషన్ అప్పుడు ప్రేక్షకులకి తెలిసింది. సరయు వెళ్లేటపుడు విశ్వ బాగా ఎమోషనల్ అయ్యాడు.
నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

















