నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం డాకు మహరాజ్ (Daaku Maharaaj), సంక్రాంతికి విడుదల కానుంది. బాబీ (Bobby) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, బాలయ్య కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ ప్రాజెక్ట్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేయగా, సినిమా పీరియాడిక్ జోనర్‌లో ఉండటం, రియల్ బందిపోటు దొంగ కథతో రూపొందించబడటం ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల దశలో ఉంది.
Daaku Maharaaj
సంక్రాంతి టార్గెట్‌గా రిలీజ్ డేట్‌ను ప్రకటించినప్పటికీ, టెక్నికల్ వర్క్ చాలా వరకు పెండింగ్‌లో ఉంది. మేకర్స్ మాత్రం ఎలాంటి మార్పు లేకుండా అనుకున్న డేట్‌కే సినిమా థియేటర్లలోకి తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు బాబీ టీమ్ రాత్రింబవళ్లు శ్రమిస్తూ, సీజీ వర్క్, బ్యాగ్రౌండ్ స్కోర్ వంటి కీలక పనులను ఫినిష్ చేస్తోంది. ఇప్పటికే పుష్ప 2(Pushpa 2: The Rule) చిత్రం కోసం సుకుమార్ (Sukumar). టీమ్ ఎలా శ్రమిస్తుందో, అదే తరహాలో డాకు మహరాజ్ టీమ్ కూడా కష్టపడుతోంది.
సుకుమార్ మూవీ రిలీజ్ సమయం దగ్గరపడుతుండటంతో టీమ్ చివరి దశ పనుల్లో ఉన్నారు. పుష్ప 2 ప్రీమియర్ షోలు డిసెంబర్ 4న జరగనున్నాయి, ఇదే రీతిగా డాకు మహరాజ్ టీమ్ సంక్రాంతి వరకు తమ సినిమాను పూర్తిగా సిద్ధం చేసే పనిలో ఉంది. మరోవైపు సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్‌కు స్పెషల్ ఎఫర్ట్స్ పెడుతున్నట్లు సమాచారం.
కథను మరింత ఎమోషనల్‌గా, పవర్‌ఫుల్‌గా చూపించేందుకు థమన్ (S.S.Thaman) పనిచేస్తున్నాడు. పీరియాడిక్ సెట్టింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లకు మ్యూజిక్ కీలకంగా మారబోతోందని అర్థమవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.