‘అఖండ'(Akhanda) ‘వీరసింహారెడ్డి'(Veera Simha Reddy) ‘భగవంత్ కేసరి'(Bhagavanth Kesari).. వంటి సూపర్ హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్న నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్'(Daaku Maharaaj). జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకి బాబీ (K. S. Ravindra) దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) నిర్మాత. మొదటి షోతోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.దీంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) రావడం వల్ల కొంచెం డౌన్ అయినా… ‘డాకు మహారాజ్’ స్ట్రాంగ్ గానే కలెక్ట్ చేస్తుంది.
‘డాకు మహారాజ్’ సినిమాకు రూ.83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.83.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 5 రోజుల్లో ఈ సినిమా రూ.63.94 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.19.56 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.