టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే ఈ మధ్య కాలంలో దిల్ రాజుకు కూడా కొన్ని సినిమాల ఫలితాలు షాకిస్తున్నాయి. రీమేక్ సినిమాల విషయంలో దిల్ రాజు తాను తీసుకున్న నిర్ణయాల గురించి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. కొన్నేళ్ల క్రితం తమిళంలో తెరకెక్కిన 96 మూవీ ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ఎలిసిందే. విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కి సంచలన విజయం సాధించింది.
ఈ సినిమాలోని కాదలే కాదలే సాంగ్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తెలుగులో ఈ సినిమా జాను పేరుతో శర్వానంద్, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కి విడుదల కాగా ఇక్కడ మాత్రం అదే మ్యాజిక్ ను రిపీట్ చేయలేదు. 96 సినిమాను చూసిన ప్రేక్షకులు జాను సినిమాను ఆదరించలేదు. అయితే రీమేక్ సినిమాల గురించి, ఆ సినిమాల ఫలితాల గురించి దిల్ రాజు స్పందిస్తూ 96 సినిమా రీమేక్ విషయంలో నా అంచనా తప్పైందని ఆయన కామెంట్లు చేశారు.
అల్లు అర్జున్, నాని, పలువురికి ఆ సినిమా చూపిస్తే నచ్చిందని దిల్ రాజు పేర్కొన్నారు. కరోనా వల్ల 96 సినిమాను ఓటీటీలో ఎక్కువమంది చూసేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జాను విడుదలైందని దిల్ రాజు తెలిపారు. 96 సినిమాను చూసిన ఫీల్ తో జాను సినిమాను ఆస్వాదించలేకపోయారని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
జాను, జెర్సీ సినిమాల విషయంలో నాకు అర్థమైంది ఏంటంటే ఏ సినిమా అయినా ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆ సినిమాను రీమేక్ చేయకూడదని దిల్ రాజు వెల్లడించారు. ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. కెరీర్ విషయంలో దిల్ రాజు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.