“జనాలు ఎందుకో థియేటర్లకు రావడం లేదు. నేను ఈ మధ్య ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో తిరిగి తిరిగి వచ్చాను. అప్పుడు నేను గమనించింది ఇది. ఎందుకో సినిమాలు చూడటానికి జనాలు అస్సలు రావడం లేదు. చాలా చోట్ల షోలు క్యాన్సిల్ అవుతున్నాయి. సెకండ్ షోలు అయితే చాలా చోట్ల వేయడం లేదు. సినిమా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇలాంటి టైంలో నేను నిర్మాతగా చేసిన సినిమాని రిలీజ్ చేయడానికి చాలా భయమేస్తుంది. మా సినిమాలో చేసిన నటీనటుల మొహాలు చూడటానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నాను.
ముందుగా ఏప్రిల్ 18కి అనుకున్నాను. తర్వాత ఏప్రిల్ 25 కి వెళ్ళింది. థియేటర్లు దొరకడం లేదు. ఒకవేళ థియేటర్లు దొరికినా నేను డబ్బులు పెట్టలేని పరిస్థితి. సాయంత్రం అయ్యేసరికి జనాలు క్రికెట్ మ్యాచ్ లే చూస్తున్నారు. అదే కారణమా లేక ఏంటి అనేది కూడా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాను. ఇప్పుడు నిర్మాతలంటే నాకు బాగా గౌరవం పెరిగిపోయింది. వాళ్ళు సినిమాని ఎలా రిలీజ్ చేస్తున్నారా? అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను. దయచేసి ప్రేక్షకులు మీరు థియేటర్లకు రావాలి. మీరు థియేటర్ కి వచ్చి ఏసీలో కూర్చుని సినిమా చూస్తేనే మేము తిండి తినగలుగుతాము.
మా సినిమాకి మాత్రమే కాదు అన్ని సినిమాలని వచ్చి చూడండి. మీరు చూస్తారనే నమ్మకంతోనే మా ‘చౌర్య పాఠం’ ని మీ ముందుకు తెస్తున్నాను” అంటూ ఈరోజు జరిగిన ‘చౌర్య పాఠం’ ట్రైలర్ లాంచ్లో దర్శకుడు త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. అయితే జనాలు థియేటర్లకు రాకపోవడానికి ప్రత్యేకంగా కారణాలు ఏంటి? ముందుగా సరైన కంటెంట్ వస్తే.. జనాలు ఎందుకు చూడట్లేదు. ఈ మధ్యనే ‘కోర్ట్’ (Court) అనే సినిమా వచ్చింది. అది అందరూ చూశారు. రూ.50 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) వచ్చింది. రీ- రిలీజ్ సినిమా అయినా.. అది కూడా చూశారు. ఫిలిం మేకర్స్ అందరూ గ్రహించాల్సింది ఒక్కటే. మీ సినిమాలో మంచి కంటెంట్ ఉండాలి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటార్లు గ్రహించాల్సింది కూడా ఒక్కటే. అది టికెట్ రేట్లు సామాన్య జనాలకి అందుబాటులో ఉండటం. జనాల దగ్గర డబ్బులు ఉన్నా.. లేకున్నా టికెట్ రేట్లు అందుబాటులో ఉన్నాయి అంటే కచ్చితంగా వాళ్ళు థియేటర్ కి వస్తారు. ఇది తెలుసుకోకుండా జనాల పేరు చెప్పి సింపతీ డైలాగులు చెప్పడం త్రినాధరావ్ నక్కిన (Trinadha Rao Nakkina) వంటి దర్శకులు మానుకోవాలి.
జనాలు థియేటర్లకు రావడం లేదు, సినిమా పరిస్థితి చాలా దారుణంగా ఉంది
కొత్తవాళ్లతో తీసిన సినిమా రిలీజ్ చేయాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలకే జనాలు రావడం లేదు #ChauryaPaatam #TrinadhaRaoNakkina pic.twitter.com/0ZSltCi7pZ
— Filmy Focus (@FilmyFocus) April 16, 2025