ఎప్పుడో 1996 నుంచి రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ తన అభిమానుల్ని, తమిళ తంబీలను టీజ్ చేస్తూ వచ్చిన రజనీ.. నిన్న ఉన్నట్లుండి డిసెంబర్ 31న పార్టీ వివరాలు వెల్లడించడమే కాక రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించనున్నట్లు.. వచ్చే ఎలక్షన్స్ లో పోటీ కూడా చేస్తున్నట్లు హింట్ ఇవ్వడం అనేది సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడా అని వెయిట్ చేసినవాళ్ళందరూ సంతోషపడితే.. రజనీ సినిమాల అభిమానులు మాత్రం రజనీ సినిమా భవిష్యత్ గురించి టెన్షన్ పడడం మొదలెట్టారు.
జనాలకంటే ఎక్కువగా.. రజనీతో తదుపరి సినిమాలు కమిట్ అయిన డైరెక్టర్స్ ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. అందులో ప్రథముడు శివ. అజిత్ తో వరుస సినిమాలు తీస్తూ అందరినీ ఆశ్చర్యపరిచిన శివ.. “విశ్వాసం” బ్లాక్ బస్టర్ హిట్ తో రజనీని డైరెక్ట్ చేసే అవకాశం సొంతం చేసుకున్నాడు. కీర్తిసురేష్ ఈ చిత్రంలో రజనీ కుమార్తెగా నటిస్తుండగా.. కార్తికేయ విలన్ గా నటించనున్నాడు. ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత షూటింగ్ ఆగిపోయింది.
ఇప్పుడు రజనీ పొలిటికల్ ఎనౌన్స్ మెంట్ తో అసలు సినిమా సెట్స్ మీదకు వస్తుందా లేదా అనే ప్రశ్న మొదలైంది. మరి రజనీ నిర్ణయం ఏమిటో, శివ భవిష్యత్ ఏమిటో, అన్నాతే పరిస్థితి ఏమిటో చూడాలి. శివతోపాటు మురుగదాస్ కూడా కంగారుపడుతున్నాడు. ఎందుకంటే దర్బార్ అనంతరం మురగకు మరో సినిమా అవకాశం ఇచ్చాడు రజనీ.