‘బిగ్ బాస్ 6’… ఫైనల్ స్టేజికి వచ్చేసింది. 13వ వారం అనూహ్యంగా ఫైమా ఎలిమినేట్ అయిపోయింది. చెప్పాలంటే ఈమె లాస్ట్ వీకే ఎలిమినేట్ అవ్వాలి. కానీ, ఫైమా వద్ద ఎవిక్షన్ పాస్ ఉండటం వల్ల సేఫ్ అయ్యింది. అప్పుడు రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఫైమా ఒక వారం లేట్ గా బ్యాగ్ సర్దుకుంది. బిగ్ బాస్ గేమ్ మార్చాలని చూసినా ఆడియన్స్ మాత్రం ఈ విషయంలో కనికరించరు. వాళ్లకు ఎవర్ని హౌస్ లో ఉంచాలనుకుంటే వాళ్ళనే ఉంచుతారు.
అందుకే ఈసారి ఫైమా తప్పించుకోలేకపోయింది. అయితే హౌస్ లో నుండి బయటకు వచ్చిన కంటెస్టెంట్లు.. వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం, బిగ్ బాస్ షో పై చాడీలు చెప్పడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం.ఫైమా కూడా అదే విధంగా చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరో వైపు ఫైమా ఎంత పారితోషికం అందుకుంది అనే విషయం పై కూడా చర్చలు మొదలయ్యాయి. ఫైమా కూడా మొదట్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లానే కనిపించింది.
కచ్చితంగా టాప్ 5 లో ఉంటుందేమో అనే ఆలోచనను అందరికీ కలిగించింది. కాకపోతే ఈసారి తనకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నామినేషన్స్ లో ఉండటంతో ఫైమాకి మైనస్ అయ్యింది. ఇక 13 వారాల పాటు హౌస్ లో ఉన్నందుకు గాను.. వారానికి 25 వేల చొప్పున మొత్తంగా రూ.3 లక్షల 25 వేలు అందుకున్నట్టు సమాచారం.
‘పటాస్’ షో ద్వారా పాపులర్ అయిన ఫైమా.. ఆ తర్వాత ‘జబర్దస్త్’ వంటి షోల ద్వారా ఇంకా పాపులర్ అయ్యింది. ‘బిగ్ బాస్ 6’ కు 17 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ‘ఫైమా’.. ఈ షో ద్వారా వచ్చిన క్రేజ్ ను ఎంత వరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి..!