సంక్రాంతి టైమ్ లో పోటీ ఈసారి డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే గేమ్ ఛేంజర్ (Game Changer) పండుగలో ఏమేరకు ఇంపాక్ట్ చూపిస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం ఓ వర్గం మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు (Dil Raju) కూడా ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు, ఎందుకంటే ఇది ఆయన మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్. దర్శకుడు శంకర్ కూడా తన కెరీర్ లో మరో హిట్ అందుకోవాలని తహతహలాడుతున్నాడు.
Game Changer
‘గేమ్ చేంజర్’ విజయం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం అని చెప్పొచ్చు. అయితే ఇప్పటివరకు సినిమాకు బజ్ అంతగా రాలేదు. విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. కానీ దీపావళి సందర్భంగా రీరిలీజ్ కానున్న టీజర్ తో మంచి హైప్ రావొచ్చని భావిస్తున్నారు. శంకర్ ఈ ప్రాజెక్ట్ పై చాలా ఫోకస్ పెట్టారు, ఇక దిల్ రాజు కూడా సినిమా రిలీజ్ ప్లాన్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
సంక్రాంతి పండుగ సీజన్ కావడంతో ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు రావడం ఖాయం. అందుకే దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో ‘గేమ్ చేంజర్’ సినిమా సగానికి పైగా అంటే 50% థియేటర్లలో ప్రదర్శించడానికి ప్లాన్ చేస్తున్నారట. బెన్ ఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. టికెట్ ధరలు పెంచడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఫెస్టివల్ సీజన్ కావడంతో ఈ విషయంలో సాయాన్ని ప్రభుత్వం కూడా అందిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
ఇక గేమ్ ఛేంజర్ తరువాత బాలకృష్ణ (Balakrishna) బాబీ (Bobby) సినిమాకు 25% థియేటర్స్ లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తండేల్ (Thandel) కూడా రాబోతోంది కాబట్టి మిగతా థియేటర్స్ లో ఎక్కువ శాతం ఈ సినిమాకు దక్కనున్నాయి. ఇక సందీప్ కిషన్ (Sundeep Kishan) మజాకా సినిమాకు సంక్రాంతి టైమ్ లో తక్కువ థియేటర్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. వెంకీ (Venkatesh Daggubati) అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమా సంక్రాంతికి రకపోవచ్చని టాక్. ఒక వేళ అది వస్తే గేమ్ ఛేంజర్ కు థియేటర్స్ తగ్గే అవకాశం ఉంటుంది.