మంచు విష్ణు టైటిల్ పాత్ర పోషించిన తాజా చిత్రం “జిన్నా”. హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సన్నీలియోన్, పాయల్ కథానాయికలుగా నటించగా.. విడుదలైన ట్రైలర్ మంచి అంచనాలను నమోదు చేసింది. మరి చాన్నాళ్లుగా సరైన సక్సెస్ చూడలేకపోయిన మంచు విష్ణు.. “జిన్నా”తోనైనా హిట్ కొట్టాడో లేదో చూద్దాం..!!
కథ: గాలి నాగేశ్వర్రావు అలియాస్ జిన్నా (మంచు విష్ణు), జీవితంలో ఎలాంటి గోల్ అనేది లేకుండా.. ఊరంతా అప్పులు చేసి.. అవి తీర్చడం కోసం ఒక టెంట్ హౌస్ షాప్ పెట్టుకొని బాగా నష్టపోయి.. ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉంటాడు. అదే సమయంలో జిన్నా జీవితంలోకి వస్తుంది రేణుక (సన్నీలియోన్). ఆమెను పెళ్లాడి, ఆమెకు ఉన్న కోట్ల రూపాయల ఆస్తి ద్వారా తన అప్పులన్నీ తీర్చేసుకోవాలనుకుంటాడు జిన్నా.
అక్కడే మొదలవుతుంది అసలు సమస్య. రేణుక గతం, ఆమె ప్రవర్తన జిన్నా ప్లానింగ్స్ అన్నీ పాడు చేస్తుంది. అసలు రేణుక ఎవరు? జిన్నాను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది? అనేది సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: కామెడీ అనేది మంచు విష్ణుకు చాలా ఈజీ జోనర్. అందువల్ల జిన్నా క్యారెక్టర్లో చాలా ఈజీగా ఒదిగిపోయాడు. కామెడీ టైమింగ్ & డ్యాన్స్ లతో ఆకట్టుకున్నాడు. సన్నీలియోన్ గ్లామర్ తోనే కాక నటనతోనూ ఆకట్టుకుంది. ఆమె క్యారెక్టర్ కు ఉన్న లేయర్స్ కథను మంచి మలుపు తిప్పాయి. పాయల్ పాత్ర చిన్నదే అయినా.. స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించింది.
వీళ్ళందరికంటే ఎక్కువగా ఆడియన్స్ ను అలరించిన నటుడు చమ్మక్ చంద్ర. హిలేరియస్ పంచ్ డైలాగులతో, బాడీ లాంగ్వేజ్ తో కడుపుబ్బ నవ్వించాడు. సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచాడు. సీనియర్ నరేష్ కూడా ఉన్నంతలో బాగా నవ్వించారు.
సాంకేతికవర్గం పనితీరు: అనూప్ రూబెన్స్ పాటలకంటే నేపధ్య సంగీతం బాగుంది. హారర్ & కామెడీ సీన్స్ ను బాగా ఎలివేట్ చేశాడు. ఛోటా కె.నాయుడు తన కెమెరా పనితనంతో హీరోయిన్ల గ్లామర్ ను, కథలోని ఎమోషన్ ను బాగా ఎలివేట్ చేశాడు. కోనా & టీం స్క్రీన్ ప్లే – డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు సూర్య.. కథను నడిపించిన విధానం సినిమాకి మెయిన్ మైనస్ గా మారింది.
అసలు కథలోకి వెళ్లడానికి ఎక్కువ సమయం తీసుకోవడమే కాక.. పాత్రల ఇంట్రడక్షన్ కోసం అనవసరమైన ఎలివేషన్స్ మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా సూర్య దర్శకుడిగా బొటాబోటి మార్కులతో గట్టెక్కాడు.
విశ్లేషణ: ఎలాగూ “జిన్నా” మీద భారీ అంచనాలు పెట్టుకొని థియేటర్లకు రారు కాబట్టి.. సన్నీ గ్లామర్, విష్ణు పంచ్ డైలాగులు, చమ్మక్ చంద్ర క్యారెక్టర్ హైలైట్స్ గా “జిన్నా” చిత్రం అలరిస్తుంది. మంచు విష్ణు కథానాయకుడిగా, నిర్మాతగా ఓ హిట్ అందుకున్నట్లే.
రేటింగ్: 2.5/5
Rating
2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus