టాలీవుడ్ ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలవ్వడం చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో సంక్రాంతి సీజన్‌లో తప్ప మిగిలిన రోజుల్లో గ్యాప్ ఇచ్చుకుంటూనే విడుదల చేస్తుంటారు. అయితే ఈ దసరాకు మాత్రం డిఫరెంట్‌గా జరిగింది. టాలీవుడ్ మిత్రులు చిరంజీవి, నాగార్జున ఒకే రోజు థియేటర్లలోకి వచ్చారు. ఎందుకొచ్చారు, వాటి వెనుక ఉన్న లెక్కేంటి అనేది పక్కనపెడితే.. ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేరోజుల రావడం ఫ్యాన్స్‌కి అయితే హ్యాపీ.
ఇప్పుడు ఓటీటీ విషయంలోనూ అదే జరగబోతోందట. అవును, అయితే థియేటర్లలో విషయంలో ఒకే రోజు రావడం కామన్ పాయింట్ అయితే, ఓటీటీల్లో ఇద్దరి సినిమాలు ఒకే దాంట్లో వస్తాయట. ‘గాడ్‌ఫాదర్’, ‘ది ఘోస్ట్’ సినిమాల ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. దీనిపై అధికారిక సమాచారం రాకున్నా.. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఈ సినిమాలు త్వరలో వస్తాయని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులు జరిగిపోయాయి అంటున్నారు.
దీంతో థియేటర్లలో ఒకే రోజు వచ్చిన మిత్రులు, ఒకే ఓటీటీలోకి వస్తున్నారు అని జోకులు పేలుతున్నాయి. గతంలో అయితే థియేటర్ రిలీజ్ – ఓటీటీ రిలీజ్‌కి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండేది కాదు. కానీ ఇటీవల నిర్మాతలు అందరూ కలసి ఎక్కువ గ్యాప్ ఉండాలి అని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాల విషయంలో ఏ రూల్ పాటిస్తారు అనేది తెలియడం లేదు. ఆ రూల్ అనుకోవడానికి ముందే ఈ సినిమాల డీల్స్ అయిపోయి ఉంటే ముందే వచ్చేస్తాయి.
లేదంటే ఆలస్యం కావొచ్చు అని చెబుతున్నారు. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే.. ‘ది ఘోస్ట్’ సినిమా తొలుత ఓటీటీకి వచ్చేస్తుంది అని అంటున్నారు. ఇక ‘గాడ్‌ఫాదర్’ సినిమా విషయానికొస్తే.. ఇది కేవలం ఒక్క ఓటీటీకే ఇచ్చారా? లేక వేరే ఓటీటీతో షేర్ చేశారా అనేది తెలియాలి. ఇటీవల కాలంలో హిట్ సినిమాల హక్కులు అలా షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.