బహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా భల్లాల దేవ గా పేరు తెచ్చుకున్ననటుడు దగ్గుబాటి రానా. ప్రస్తుతం బాహుబలి – కంక్లూజన్ షూటింగ్ లో బిజీగా ఉన్నా, తెలుగు కబడ్డీ టీమ్ తెలుగు టైటాన్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. వారి మ్యాచ్ లకు తప్పకుండా హాజరవుతున్నారు. ఈ సందర్బంగా ఆయనను పలకరించగా “నాకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. కబడ్డీకి నేను ఫ్యాన్” అని చెప్పారు. సినిమాల్లోకి రాక పూర్వం రానా బాక్సింగ్ లో శిక్షణ పొందారు.
ఈ విషయం పై మాట్లాడుతూ “నాకు మైక్ టైసన్ అంటే చాలా ఇష్టం. హెవీ వెయిట్ బాక్సింగ్ లో ట్రైన్ అయ్యాను. ఆ సమయంలో చాలా గాయాలయ్యాయి. అంతేకాకుండా అందుకోసం చాలా టైం కేటాయించాలి. కాబట్టి ఆపేసాను. అయినా ఇప్పటికీ రెజిలింగ్, బాక్సింగ్ అంటే ప్రాణం.” అని వెల్లడించారు. కలియుగ భీమగా పేరుతెచ్చుకున్న విజయనగరానికి చెందిన లెజెండ్ రెజ్లర్ కోడి రామమూర్తి నాయుడి పాత్రను సినిమాలో చేయాలని ఉందని చెప్పారు. “చిన్నపుడు అతని గురించి పుస్తకాల్లో చదుకున్నపుడే అభిమానం ఏర్పడింది.
అప్పటినుంచి కోడి రామమూర్తి గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. ఆయన్ను ఇనుప సంకెళ్లతో బంధిస్తే కండలను బిగపట్టి వాటిని తెంచేవారంటా!! అటువంటి ఎన్నో సంగతులను తెరపైన చూపించాలని ఉంది. ఎప్పుడు చేస్తానో కరెక్ట్ గా తెలియదు కానీ. తప్పకుండా చేస్తాను.” అని రానా వివరించారు. బాహుబలి – కంక్లూజన్ తర్వాత రానా తేజ దర్శకత్వంలో నటించనున్నారు. తమిళ డైరక్టర్ బాల తోను సినిమా చేయనున్నారు.