యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా ఫ్యాన్స్ మధ్య జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాత సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరపున 12 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకునే వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. అయితే ఎన్టీఆర్ పవన్ బాటలో పయనిస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించక ముందు రోజుకో జిల్లా అభిమానులతో సమావేశమవుతూ జిల్లాలో నెలకొన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకునేవారు. ఎన్టీఆర్ ఉక్రెయిన్ కు వెళ్లకముందు అభిమాన వర్గాలతో తరచూ సమావేశాలు నిర్వహించారని కష్టాల్లో ఉన్న అభిమానులకు ఎన్టీఆర్ తన వంతు సహాయం చేస్తున్నారని తెలుస్తోంది. కొంతమంది అభిమానులకు ఎన్టీఆర్ మళ్లీ అపాయింట్ మెంట్ ఇస్తున్నారని భోగట్టా. మరి ఎన్టీఆర్ రాజకీయాలపై నిజంగా దృష్టిపెట్టారా? 2024 ఎన్నికల్లో ఎన్టీఆర్ పోటీ చేయబోతున్నారా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ రాజకీయాల్లో రాణించాలనుకుంటున్నారా..? లేదా..? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. అయితే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేస్తారా..? లేక కొత్త పార్టీ పెడతారా..? తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు.