నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు 17ఏళ్ళు అవుతుంది. ఇన్నేళ్ల కెరీర్ లో ఈ హీరోలు దాదాపు 20సినిమాల వరకు చేశారు. కానీ ఆయనకు విజయాన్ని అందించింది రెండే రెండు. వాటిలో ఒకటి దర్శకుడు సురేంధర్ రెడ్డి తెరకెక్కించిన అతనొక్కడే, రెండు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన పటాస్. ఈ రెండు చిత్రాలు మినహా కళ్యాణ్ రామ్ కెరీర్ లో క్లీన్ హిట్ అని చెప్పుకోవడానికి ఒక్క చిత్రం లేదు. యాక్షన్, థ్రిల్లర్స్, కామెడీ అన్ని రకాల జోనర్స్ ఆయన ట్రైచేశారు. నందమూరి కుటుంబం నుండి వచ్చిన ఈ హీరో ఒక స్థాయి హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈయన కంటే వెనుక వచ్చిన నాని, శర్వానంద్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు సైతం టాలీవుడ్ లో మంచి హిట్లు అందుకొని ఒక ఇమేజ్ సంపాదించుకున్నారు.
పటాస్ మూవీ వచ్చి ఐదేళ్లు ఐపోతుంది. ఈ ఐదేళ్లలో ఆయన నటించిన చాలా చిత్రాలు విడుదల అయ్యాయి. కానీ ఒక్కటి కూడా విజయం సాధించలేదు. సంక్రాంతి పండుగైనా తన ఫేట్ మార్చుతుందని..ఎంత మంచివాడవురా అనే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వచ్చాడు. ఈ చిత్రం కూడా కళ్యాణ్ కి విజయం అందిచలేకపోయింది. యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు సైతం సంక్రాంతి సీజన్లో మెరుగైన వసూళ్లు రాబడతాయి. అలాంటిది కళ్యాణ్ రామ్ మూవీ వరల్డ్ వైడ్ గా కనీసం 5కోట్ల షేర్ సాధించడానికి ఆపసోపాలు పడుతుంది. దర్శకుడు సతీష వేగేశ్న కుటుంబాల మధ్య అనుబంధాలతో, పల్లె వాతావరణంలో సాగే పండుగ సినిమా తీసినా ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు. దీనితో ఎంత మంచివాడవురా చిత్రానికి కాసులు రాలడం లేదు. ఒక విధంగా నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ ప్రమాదంలో పడింది.