ఒక్క ఫ్లాప్ కే డల్ అయిపోయిన కైరా అద్వానీ
- January 27, 2019 / 08:30 AM ISTByFilmy Focus
సముద్రం అన్నాక అలలు రావడం, సినిమాలన్నాక ఫ్లాపవ్వడం అనేది చాలా కామన్. ఈ విషయం పాపం క్యూట్ హీరోయిన్ కైరా అద్వానీకి ఇంకా బోధపడినట్లు లేదు. అందుకే “వినయ విధేయ రామ” ఫ్లాప్ గురించి తెగ బాధపడిపోతోందట. ఆ బాధ కూడా ఏరేంజ్ లో పడుతుంది అంటే.. ఫ్రెండ్స్ కి ఇచ్చే ప్రయివేట్ పార్టీస్ లో కూడా ఏడుపు మొహం వేసుకొని కూర్చుంటుందట. దాంతో పార్టీ ఎంజాయ్ చేయడం మానేసి ఆమెను సముదాయించుకుంటూ ఉండిపోతున్నారట ఆమె స్నేహితులు.
- ‘మిస్టర్ మజ్ను’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!
- వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- మణికర్ణిక రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అమ్మడికి అర్జెంట్ గా ఒక సూపర్ హిట్ పడితే తప్ప మళ్ళీ నార్మల్ మూడ్ లోకి వచ్చేలా లేదు. సో, ప్రస్తుతం అర్జున్ రెడ్డి రీమేక్ గా రూపొందుతున్న కబీర్ సింగ్ మీద చాలా ఆశలు పెట్టుకొంది కైరా అద్వానీ. ఈ సినిమా హిట్ అయితే తప్ప కొత్త ప్రొజెక్ట్స్ కూడా ఏవీ సైన్ చేయను అని అంటోందట. కానీ.. ఆమె మ్యానేజర్స్ మాత్రం అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని వారిస్తున్నారట. అయినా ఒక్క ఫ్లాప్ కే ఇలా అయిపోతే ఎలా కైరా.
















