‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు.. ఇండస్ట్రీ బంద్ నిఖిల్ చావుకొచ్చి పడింది’. పాపం ‘కేశవ’ తర్వాత ఎన్నో హోప్స్ పెట్టుకొని కన్నడలో సూపర్ హిట్ అయిన “కిరిక్ పార్టీ” చిత్రాన్ని ఇష్టపడి తెలుగులో “కిర్రాక్ పార్టీ”గా రీమేక్ చేయించుకొని మరీ నటించాడు. కాలేజ్ లవ్ స్టోరీ కావడంతో యూత్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారని, మళ్ళీ తనకో సూపర్ హిట్ దొరికేసినట్లేనని ఫీలైపోయాడు. కట్ చేస్తే.. డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్లుగా.. ఫిబ్రవరిలో సినిమాని విడుదల చేద్దామనుకొంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవ్వకపోవడంతో సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. పోన్లే ఫిబ్రవరిలో కాకపోయినా మార్చిలో వచ్చైనా మంచి హిట్ కొడదామనుకొంటే ఉన్నపళంగా ఇండస్ట్రీ బంద్ ప్రకటించారు.
దాంతో మార్చి 16న విడుదల చేద్దామనుకొన్న నిఖిల్ “కిర్రాక్ పార్టీ” ఇప్పుడసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనే క్లారిటీ నిఖిల్ కే కాదు దర్శకనిర్మాతలకు కూడా క్లారిటీ లేదు. ఇక మార్చి 30న “రంగస్థలం”, ఏప్రిల్ 20న “భారత్ అదే నేను”, మే 4న “నాపేరు సూర్య” లాంటి పెద్ద సినిమాలు క్యూ కట్టడంతో తమ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.