‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత.. ‘శ్యామ్ సింగ రాయ్’ ‘బంగార్రాజు’ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు అందుకుంది బ్యూటీ.దీంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూలు కట్టాయి. మొదటి సినిమాకి రూ.6 లక్షలు పారితోషికం అందుకున్న ఈ బ్యూటీ రెండో సినిమాకి రూ.60 లక్షలు డిమాండ్ చేసింది. అటు తర్వాత శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు హిట్ అవ్వడంతో కృతి శెట్టి కోటి రూపాయలు హీరోయిన్ అయిపోయింది.
నితిన్ కు జోడీగా నటించిన మాచర్ల నియోజకవర్గం, రామ్ కు జోడీగా నటించిన ది వారియర్ చిత్రాలకు ఆమె కోటి రూపాయలు పారితోషికం అందుకుంది. నాగ చైతన్య తో చేస్తున్న కస్టడీ మూవీకి కూడా ఆమె కోటి రూపాయలు అందుకున్నట్టు వినికిడి. అయితే ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడం.. అటు తర్వాత వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా కూడా ఫ్లాప్ అవ్వడంతో కృతి శెట్టి డిమాండ్ తగ్గింది.
ఇదే టైంలో శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు కొట్టి దర్శక నిర్మాతల కంట్లో పడటంతో కృతి శెట్టి అలెర్ట్ అయినట్టు స్పష్టమవుతుంది. ప్రస్తుతం కృతి.. శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ మూవీ కోసం కృతి శెట్టి రూ.60 లక్షలు పారితోషికం అందుకున్నట్టు సమాచారం. కృతి తీసుకుంది తెలివైన డెసిషనే.. కానీ తన రాబోయే చిత్రాలు హిట్ అయితేనే మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. లేదంటే కష్టమే!