Lucky Baskhar Collections: ‘లక్కీ భాస్కర్’ ..4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసింది..!
- November 4, 2024 / 02:19 PM ISTByFilmy Focus
‘మహానటి’ (Mahanati) ‘సీతా రామం’ (Sita Ramam) వంటి హిట్లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ‘లక్కీ భాస్కర్’ తో (Lucky Baskhar) మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ . దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైంది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను బాగా ఓన్ చేసుకున్నారు అని చెప్పాలి.
Lucky Baskhar Collections:

మొదటి రోజు డీసెంట్ గా కలెక్ట్ చేసిన ఈ సినిమా.. 2 వ రోజు, 3వ రోజు, 4వ రోజు కూడా మొదటి రోజుకి తగ్గకుండా కలెక్ట్ చేసింది. ఒకసారి (Lucky Baskhar) వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 5.82 cr |
| సీడెడ్ | 1.26 cr |
| ఆంధ్ర(టోటల్) | 4.30 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 11.38 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.30 cr |
| ఓవర్సీస్ | 0.32 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్ ) | 12.00 cr |
‘లక్కీ భాస్కర్’ (తెలుగు వెర్షన్) కి రూ.11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 4 రోజుల్లో ఈ చిత్రం రూ.12 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.0.50 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది. మరి వీక్ డేస్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

















