సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ పై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చెయ్యడం చర్చనీయాంశం అయ్యింది. మ్యాటర్ ఏంటంటే… చెన్నైలో రజినీ కాంత్ కు రాఘవేంద్ర కళ్యాణమండపం ఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన వల్ల మార్చి 24 నుండీ ఆ కళ్యాణమండపాన్ని మూసేశారు.పెళ్లిళ్లు జరిగే ఛాన్స్ కూడా లేదు కదా.!.దాంతో ఆ కళ్యాణ మండపం నుండీ రావాల్సిన ఆదాయం ఆగిపోయింది. కానీ దానికి గాను 6.5 లక్షల పన్ను చెల్లించాలంటూ చెన్నై కార్పొరేషన్ వారు రజనీ కాంత్ కు నోటీసులు పంపారు.
దీనిని వ్యతిరేకిస్తూ రజినీ హైకోర్టును ఆశ్రయించారు. ‘లాక్‌డౌన్ కారణంగా ఫంక్షన్ హాల్‌ను మూసేశాము. మాకు ఎటువంటి ఆదాయం రాలేదు.అలాంటిది ఏప్రిల్ నుండీ సెప్టెంబరు వరకూ పన్ను చెల్లించాలని కార్పొరేషన్ వారు నోటీసులు పంపడం సరికాదని’ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం పై మద్రాసు హైకోర్టు స్పందిస్తూ..రజినీ దాఖలు చేసిన పిటిషన్‌ను తప్పుబట్టింది.అంతేకాదు పన్ను వేయడాన్ని వ్యతిరేకిస్తే జరిమానా విధించే ఛాన్స్ లు కూడా ఉన్నాయని సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో రజినీ లాయర్.. ‘ కేసును విత్ డ్రా చేసుకోవడానికి కొంత సమయం కావాలని’ కోర్టువారిని కోరారు.