తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు మంచు మోహన్ బాబు ఒకరు. ఈయన రాయలసీమ చిత్తూరు జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో జన్మించి సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కొని ఇండస్ట్రీలో నిలదొక్కుకొని నేడు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఇక ఈయన ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందడమే కాకుండా ఒక విద్యావేత్తగా కూడా విద్యాసంస్థలను స్థాపించి ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.
ఇకపోతే తాజాగా మోహన్ బాబు తన 71వ పుట్టినరోజు వేడుకలను నేడు (మార్చి 19) జరుపుకుంటున్న నేపథ్యంలో ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన సినిమా ఇండస్ట్రీలో తాను ఈ స్థాయిలో ఉండడానికి పడినటువంటి కష్టాలు అవమానాలను గురించి తెలియజేశారు. సాధారణంగా ఇండస్ట్రీలో నిరదోక్కుకోవడం అంటే ఆషామాషీ కాదు. ఎన్నో అవమానాలను చీదరింపులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇలాంటి అవమానాలను కష్టాలను తాను కూడా పడ్డానని మోహన్ బాబు తెలిపారు.ఈ క్రమంలోనే ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను పైకి చూడటానికి మీ అందరికీ చాలా ఉన్నతంగా కనిపించవచ్చు కానీ నా జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయని ఈయన తెలియజేశారు.సినిమాలపై మక్కువతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు చేశాను అయితే ఒకానొక సమయంలో తాను ఆస్తులన్నింటినీ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా చివరికి తాను ఉంటున్న ఇంటిని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ సమయంలో తనకు ఏ ఒక్కరు కూడా సహాయ పడలేదని ఈయన తన కష్టాలను గుర్తు చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలను అనుభవించి నేడు ఈ స్థాయికి వచ్చానని అయితే కొన్నిసార్లు తన కష్టాల గురించి ఆలోచించినప్పుడు పగవాడికి కూడా ఈ కష్టాలు రాకూడదని నేను కోరుకుంటాను అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.