‘ఓదెల రైల్వే స్టేషన్’ (Odela Railway Station) సినిమాకు సీక్వెల్ గా ‘ఓదెల 2’ (Odela 2) వచ్చింది. తమన్నా (Tamannaah Bhatia) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఇది. ఏప్రిల్ 17న రిలీజ్ అయ్యింది. అశోక్ తేజ(Ashok Teja) దర్శకుడు. స్టార్ డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) ఓ నిర్మాత,దర్శకత్వ పర్యవేక్షకుడిగా కూడా వ్యవహరించారు. మొదటి రోజు సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది.సమాధి శిక్ష, పంచాక్షరి మంత్రం,ఓదెల మల్లన్న దర్శనం వంటి హైలెట్స్ సినిమాలో ఉన్నా… ఆడియన్స్ పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదు.
మొదటి రోజు సరైన టాక్ రాకపోవడంతో ఓపెనింగ్స్ దెబ్బతిన్నాయి. వీక్ డేస్ లో మరింతగా డ్రాప్ అయ్యింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.98 cr |
సీడెడ్ | 0.38 cr |
ఆంధ్ర | 1.00 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 2.36 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.17 cr |
హిందీ | 0.08 cr |
ఓవర్సీస్ | 0.22 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 2.83 cr (షేర్) |
‘ఓదెల 2’ చిత్రానికి రూ.9.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.10 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం ముగిసేసరికి ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.2.83 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.4.8 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.7.17 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇక ఆ టార్గెట్ రీచ్ అవ్వడం అన్ని విధాలుగా కష్టమే అని చెప్పాలి.