‘ఇప్పుడు మీరు చూడబోయేది.. ఇంతకు ముందు చూడనిది. కానీ ఎప్పుడో చూశామే 30,40 ఏళ్ల క్రితం అన్నట్టు ఉంటుంది’ అంటూ ‘శక్తి’ సినిమాలోని ‘రుద్ర’ పాత్రని రివీల్ చేస్తూ దర్శకుడు మెహర్ రమేష్ (Meher Ramesh) చెప్పిన మాటలు ఇవి. ‘మగధీర’ (Magadheera) లో కాలభైరవ(రాంచరణ్) (Ram Charan) పాత్రకి ఇచ్చిన రేంజ్ ఎలివేషన్ ‘శక్తి’ (Sakthi) లో ఎన్టీఆర్ (Jr NTR) రుద్ర పాత్రకి ఇచ్చారు. వాస్తవానికి కాలభైరవ, రుద్ర.. ఈ పేరు పరమశివునికి ఉన్న మరో పేర్లు అని అంతా చెబుతారు.
Kannappa
కానీ ‘కాలభైరవ’ రేంజ్లో ‘రుద్ర’ పాత్ర మెప్పించలేదు. పైగా ‘మగధీర’ ఇండస్ట్రీ హిట్ అయితే ‘శక్తి’ ఇండస్ట్రీలో ఉన్న బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా మిగిలిపోయింది. రుద్ర పాత్ర కూడా ఆ సినిమాని గట్టెక్కించలేదు. పైగా ఆ పాత్రకు సంబంధించిన ఎన్టీఆర్ లుక్స్ పై కూడా గట్టిగా ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా రుద్రలో అనే పాత్రలో కనిపించబోతున్నాడు. అది మరెవరో కాదు.. ప్రభాస్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కన్నప్ప’ లో (Kannappa) గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ ఏ పాత్ర పోషిస్తున్నాడు అనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా జరిగింది. మొదట శివుడి పాత్రలో తర్వాత నంది పాత్రలో ప్రభాస్ (Prabhas) కనిపిస్తాడని ప్రచారం జరిగింది. ఫైనల్ గా రుద్ర అనే పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నట్టు మంచు విష్ణు (Manchu Vishnu) తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ప్రభాస్ లుక్ కి సంబంధించిన పోస్టర్ ను కూడా జతచేశాడు.
‘కన్నప్ప’ లో పరమశివుని పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) నటిస్తున్నాడు. అయితే పరమశివుడు మారు రూపం ధరించి తిన్నడు(మంచు విష్ణు) కి దర్శనమిస్తాడట. ఆ మారు రూపం రుద్ర పాత్ర అని తెలుస్తుంది. ఆ పాత్రలోనే ప్రభాస్ కనిపిస్తాడని ఇన్సైడ్ టాక్. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.రుద్ర లుక్లో ప్రభాస్ బాగున్నాడు. మరి ఈ సినిమాని బాక్సాఫీస్ వద్ద రుద్ర గట్టెక్కిస్తాడా? లేక ‘శక్తి’ లో ‘రుద్ర’లా చేతులెత్తేస్తాడా? అనేది ఏప్రిల్ 25న(రిలీజ్ డేట్) తెలుస్తుంది.