స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలలో నటిస్తుండగా ప్రభాస్ భవిష్యత్తు సినిమాల బడ్జెట్ దాదాపుగా 2000 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. ది రాజాసాబ్ (The Rajasaab) , స్పిరిట్ (Spirit), హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్ లో మూవీ, సలార్2 (Salaar) సినిమాలు 300 నుంచి 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనున్నాయి. కల్కి (Kalki 2898 AD) సీక్వెల్ మాత్రం ఏకంగా 700 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఈ విధంగా ప్రభాస్ సినిమాలు బడ్జెట్ విషయంలో సైతం రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.
Prabhas
ప్రభాస్ స్టామినాకు ఈ బడ్జెట్లే ప్రూఫ్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు సైతం సక్సెస్ సాధిస్తే ప్రభాస్ సినిమాల బడ్జెట్లు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. ప్రభాస్ సినిమాలకు జరుగుతున్న బిజినెస్ విషయంలో నిర్మాతలు సైతం పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారు. ప్రభాస్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.
ప్రభాస్ సినిమాలు అంటే నిర్మాతలు సైతం చేతికి ఎముక లేకుండా ఖర్చు చేస్తున్నారు. ప్రభాస్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా భిన్నమైన కథలను ఎంచుకోవడం సినిమా సినిమాకు జానర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం ప్రభాస్ కు ప్లస్ అవుతోంది. ప్రభాస్ పారితోషికం సినిమాను బట్టి డేట్స్ ను బట్టి ఉందని సమాచారం అందుతోంది.
ది రాజాసాబ్ మూవీ 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమా ప్రభాస్ కెరీర్ కు కీలకం అనే సంగతి తెలిసిందే. ప్రభాస్ ది రాజాసాబ్ తో సక్సెస్ సాధిస్తే ప్రభాస్ ఖాతాలో హ్యాట్రిక్ చేరుతుంది. ప్రభాస్ కు ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో మార్కెట్ ఉంది. ప్రభాస్ కు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.