దర్శకధీరుడు రాజమౌళి వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ దేశ పౌరుడిగా తన బాధ్యతను నెరవేరుస్తుంటారు. కొన్నేళ్ళ క్రితం కొత్త సంవత్సరం వేడుకల్లో అందరూ ఉంటే అతను మాత్రం రోడ్డుపై ట్రాఫిక్ క్లియర్ చేశారు. స్టార్ డైరక్టర్ అయి ఉండి రెమ్యునరేషన్ గురించి ఆలోచించకుండా యువకుల్లో చైతన్యం కోసం టీవీలో షో చేశారు. ఇప్పుడు మరో కార్యక్రమంతో మరింతమంది మదిలో గొప్ప స్థానం సంపాదించుకున్నారు. కర్ణాటకలోని బళ్లారి నగర పాలికెను స్వచ్ఛంగా మార్చడానికి బళ్లారి జిల్లా అధికారి డాక్టర్ వి.
రామప్రశాత్ మనోహర్ చేపట్టిన ఉద్యమానికి నిర్మాత కొర్రపాటి సాయి, దర్శకుడు రాజమౌళి మద్దతుగా నిలిచారు. స్వచ్ఛ ఉద్యమానికి సాయంగా 6 లక్షలు అందించారు. మొన్న బళ్లారి నగర పర్యటనకు వెళ్లిన రాజమౌళి, కొర్రపాటి సాయితో జిల్లా అధికారి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొర్రపాటి సాయి బళ్లారి స్వచ్ఛ అభియాన్‌కు మద్దతుగా 6 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ చెక్కును రాజమౌళి జిల్లా అధికారికి అందించారు. రాజమౌళికి ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకతోను మంచి అనుబంధం ఉంది. ఆ బంధాన్ని మరిచిపోకుండా ఈ సాయం చేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.