క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమాతో మొత్తానికి ఫ్యాన్ ఇండియా దర్శకుడిగా ఒక క్రేజ్ అయితే అందుకున్నాడు. ఇక పుష్ప సెకండ్ పార్ట్ ను కూడా అంతకుమించి తెరపైకి తీసుకు రావాలి అని ఈ దర్శకుడు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ కు జరిగినట్లు కాకుండా ఇప్పుడు పక్కా ప్రణాళికతో షూటింగ్ పూర్తి చేసి వీలైనంత ఎక్కువ సమయాన్ని ప్రమోషన్స్ కోసం కూడా దాచుకోవాలని అనుకుంటున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేస్తారు అని మరొక టాక్ వినిపిస్తోంది.
సినిమా షూటింగ్ దాదాపు 80శాతం పూర్తయింది. అయితే మరి కొన్ని సన్నివేశాల విషయంలో దర్శకుడు కొత్తగా ఆలోచించి రీ షూట్ చేసే అవకాశం ఉందని కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఈ షూటింగ్ విషయంలో సుకుమార్ చాలా సమయం తీసుకుననెలా ఉన్నాడు అని రామ్ చరణ్ కు అర్థమైపోయింది. అంతేకాకుండా సుకుమార్ మధ్యలో విజయ్ దేవరకొండ తో కూడా ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. పుష్ప 2 అనంతరం విజయ్ దేవరకొండ సినిమా లైన్ లో పెడతాడాని తెలుస్తోంది.
ఈ క్రమంలో రామ్ చరణ్ తేజ్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ వచ్చే ఏడాది కూడా సెట్స్ పైకి రాకపోవచ్చు అని తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అనంతరం గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టును తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. అంతే కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో చర్చలు జరుపుతున్నాడు.
ఈ క్రమంలో గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టును ముందుగా ఫినిష్ చేసి ఆ తర్వాత సుకుమార్ ప్రాజెక్టును లైన్ లోకి తేవాలి అనే ఆలోచనలో ఉన్నాడు. ఆలోపు ప్రశాంత్ కూడా ప్రభాస్ తో మరో సినిమాను ఫినిష్ చేసే అవకాశం ఉంటుంది. ఇక రామ్ చరణ్ సుకుమార్ ప్రాజెక్టు మాత్రం వచ్చే ఏడాది తెరపైకి రావడం అనుమానంగానే ఉన్నట్లు అనిపిస్తోంది.