ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన ‘మిర్చి’ (Mirchi) తో దర్శకుడిగా మారాడు కొరటాల శివ (Koratala Siva). అప్పటివరకు ఆయన ‘భద్ర’ (Bhadra) ‘సింహా’ (Simha) ‘బృందావనం’ (Brindavanam) వంటి సూపర్ హిట్ సినిమాలకి రైటర్ గా పనిచేశారు. ‘మిర్చి’ మంచి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. రొటీన్ కథ అయినప్పటికీ.. దానికి కొరటాల ట్రీట్మెంట్, ప్రభాస్ ను అతను ప్రజెంట్ చేసిన తీరు.. అభిమానులనే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ ను కూడా అమితంగా ఆకట్టుకుంది. అందుకే వెంటనే మహేష్ బాబు ఛాన్స్ ఇచ్చాడు.
వీరి కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీమంతుడు’ (Srimanthudu) ‘భరత్ అనే నేను’ (Bharat Ane Nenu).. రెండూ బ్లాక్ బస్టర్సే. తర్వాత ఎన్టీఆర్ (Jr NTR)– కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) ‘దేవర’ (Devara) కూడా ఒక దాన్ని మించి మరొకటి అన్నట్టు కమర్షియల్ సక్సెస్..లు అందుకున్నాయి. కొరటాల కెరీర్లో రిమార్క్ అంటే.. ‘ఆచార్య’ (Acharya) సినిమా అనే చెప్పాలి. అది దారుణంగా ప్లాప్ అయ్యింది. అందులో ఆకట్టుకునే సన్నివేశాలు ఒకటి, రెండు కూడా ఉండవు.
అలా అని ‘దేవర’ కూడా సూపర్ హిట్ సినిమా అని చెప్పలేం. కమర్షియల్ లెక్కలు పక్కన పెడితే.. కంటెంట్ పరంగా ఆ సినిమా కూడా ఆడియన్స్ ని పూర్తిస్థాయిలో మెప్పించలేదు. దీనికి రెండో భాగం కూడా ఉంటుంది అని ప్రకటించారు. కానీ ఇప్పట్లో అది కష్టమే..! మరోపక్క టాలీవుడ్లో కొరటాల శివతో పని చేయడానికి స్టార్ హీరోలు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో అతను ఓ బాలీవుడ్ హీరోని పట్టినట్టు ఇన్సైడ్ టాక్.
అవును కొరటాల త్వరలో ఓ బాలీవుడ్ స్టార్ తో పని చేయబోతున్నారు. అతను మరెవరో కాదు రణబీర్ కపూర్ (Ranbir Kapoor). ఇటీవల రణబీర్ ని కలిసి కొరటాల కథ చెప్పడం. దానికి రణబీర్ ఓకే చెప్పడం జరిగాయట. ఇందులో కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా ఎంపికైనట్టు కూడా టాక్ నడుస్తుంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.