రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రికార్డులను క్రియేట్ చేస్తుండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమాకు టికెట్లు దొరకడం తేలిక కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే బుక్ మై షోలో ఆర్ఆర్ఆర్ మూవీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
బుక్ మై షో వెబ్ సైట్ లో ఏకంగా 10 లక్షల మంది ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఆసక్తి చూపిస్తున్నామని పేర్కొన్నారు. ఒక విధంగా ఇది అరుదైన రికార్డ్ అనే చెప్పాలి. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లకు ఆన్ లైన్ లో టికెట్ కొనుగోలు చేసే అవకాశం లేదు. బుక్ మై షోతో పాటు టికెట్లు బుకింగ్ చేసుకోవడానికి వేర్వేరు వెబ్ సైట్లు అందుబాటులో ఉన్నాయి.
అయినప్పటికీ బుక్ మై షో వెబ్ సైట్ లోనే ఏకంగా ఒక మిలియన్ మంది ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపించడం గమనార్హం. చరణ్, తారక్ అభిమానులు ఈ సినిమా కోసం ఏ స్థాయిలో ఆసక్తి చూపిస్తున్నారో ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిక్షనల్ కథాంశంతో తెరకెక్కిన ఈ పీరియాడికల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు చేస్తుందో చూడాల్సి ఉంది. డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా కీరవాణి సంగీతం అందించారు.
అజయ్ దేవగణ్, శ్రియ, ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. రిలీజైన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ అభిమానుల ఆశలను కచ్చితంగా నెరవేరుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.