సినిమాలోని కంటెంట్ కంటే ఫస్ట్ లుక్ లాంచ్ టైంలో బాలయ్య చేసిన హంగామా వల్ల ఎక్కువ పాపులర్ అయిన చిత్రం “సెహరి”. యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం యూత్ ఆడియన్స్ ను అలరించింది. మరి సినిమా సంగతేంటో చూద్దాం..!!
కథ: వరుణ్ (హర్ష్) ఓ సాదాసీదా కుర్రాడు. కాలేజ్ లైఫ్ లో ప్రేమించిన సుబ్బలక్ష్మిని పెళ్లి చేసేసుకుందామని ఫిక్స్ అవుతాడు. హర్ష్ కుర్రతనాన్ని చూసి చిరాకుపడి ఆమె బ్రేకప్ చెప్పేస్తుంది. దాంతో వెంటనే పెళ్లి చేసుకుని తన మేల్ ఈగోని సాటిస్ఫై చేయాలనుకుంటాడు హర్ష్. ఆ క్రమంలో పెద్దలు కుదిర్చిన ఆలియాతో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. కట్ చేస్తే.. హర్ష్ లైఫ్ లోకి ఎంటరవుతుంది పెళ్లికూతురు ఆలియా చెల్లెలు అమూల్య (సిమ్రాన్ చౌదరి). అప్పటివరకూ అక్కని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన హర్ష్.. ఆమె చెల్లిని ప్రేమించడం మొదలెడతాడు. ఈ కన్ఫ్యూజన్ లవ్ స్టోరీ ఏ తీరానికి చేరింది? అనేది “సెహరి” కథాంశం.
నటీనటుల పనితీరు: మొదటి సినిమా అయినప్పటికీ.. పాత్రకు తగ్గ నటన కనబరిచాడు హర్ష్. బేసిగ్గా తన ఏజ్ & ఫేస్ కి తగ్గ క్యారెక్టర్ ను ఎంచుకోవడం ప్లస్ అయ్యింది. ఎమోషనల్ సీన్స్ లో కాస్త పరిణితి చెందాల్సి ఉన్నప్పటికీ.. కామెడీ సీన్స్ లో మాత్రం అలరించాడు. సిమ్రాన్ చౌదరి గ్లామర్ & పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. అభినవ్ గోమటం కామెడీ లైనర్స్ అలరిస్తాయి. మిగతా నటీనటులందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్.. దర్శకుడు పాత్రలు మరియు వాటి తీరుతెన్నులు నుండి కథను డీవియేట్ చేయకపోవడం. నిజానికి ఈ తరహా రోమాంటిక్ కామెడీ సినిమాలను తెలుగులో చూసి చాన్నాళ్లయ్యింది. సో, డైరెక్టర్ జ్ణానసాగర్ తన టార్గెట్ ఆడియన్స్ ను సంతుష్టులను చేశాడనే చెప్పాలి. పాటలు పర్వాలేదు. కెమెరా వర్క్ పరంగా కొత్తదనం లేకపోయినా.. కంటెంట్ ఎలివేట్ చేసే విధంగా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ కోసం కాస్త ఎక్కువ ఖర్చు కనిపిస్తుంది.
విశ్లేషణ: ఇరికించిన పాటలు, అనవసరమైన ఫైట్లు లేకుండా యాంపిల్ పెర్ఫార్మెన్స్ లతో తెరకెక్కిన చిత్రం “సెహరి”. మరీ ఎక్కువ లాజిక్స్ & జస్టిఫికేషన్స్ లేకుండా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళి, ఎండింగ్ వరకూ ఆడియన్స్ ను ఆకట్టుకునే చిత్రమిది. సో, ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే తప్పకుండా అలరిస్తుంది.