RJ Shekar Basha Eliminated: ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసిన శేఖర్ బాషా!
- September 15, 2024 / 11:03 AM ISTByFilmy Focus
‘బిగ్ బాస్ 8’ ప్రారంభమయ్యి 2 వారాలు పూర్తి కావస్తోంది. మొదటి వారం బెజవాడ బేబక్క(Bejawada Bebakka) ఎలిమినేట్ అయ్యింది. ఇక రెండో వారం ఆమెకు బడ్డీగా హౌస్ లోపలికి వెళ్లిన శేఖర్ బాషా (Shekar Basha) ఎలిమినేట్ అయినట్లు సమాచారం. దీంతో ఆడియన్స్ షాక్ కి గురవుతున్నారు. అసలు శేఖర్ బాషా ఎలిమినేట్ అవ్వడం ఏంట్రా బాబూ..? అంటూ షాక్ కి గురవుతున్నారు. ఎందుకంటే హౌస్‌లో కామెడీ చేసి ఎంటర్టైన్ చేస్తున్న కంటెస్టెంట్ అతనే..! అతని జోక్స్ ఫన్నీగానే కాకుండా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునే విధంగా కూడా ఉంటున్నాయి.
Shekar Basha Eliminated
సోషల్ మీడియాలో కూడా అవి బాగా వైరల్ అవుతున్నాయి. అలా ఎంటర్టైన్ చేసే శేఖర్ బాషా ఎలిమినేట్ అవ్వడం ఏంటి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న? పృథ్వీ, ఆదిత్య ఓం, సీత.. వీళ్ళలో ఒకరు ఈ వీక్ ఎలిమినేట్ అవొచ్చు అని అంతా అనుకున్నారు. కానీ ఈ విషయం ‘బిగ్ బాస్ ఆడియన్స్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అయితే దీనిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పృథ్వీ, ఆదిత్య ఓంల కంటే.. శేఖర్ బాషాని తక్కువ ఓట్లు పడ్డాయని.. ఆ కారణం వల్లే అతను ఎలిమినేట్ అవుతున్నాడు అంటున్నారు.

శేఖర్ బాషా కొన్నిసార్లు అగ్రెసివ్ అవుతున్నాడు అనేది నిజం. కంటెస్టెంట్ కి కోపం అనే లక్షణం ఉండాలి. శేఖర్ బాషా కోపం కూడా లాజికల్ గానే ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే..శేఖర్ భాషా భార్యకి ఈ నెల డెలివరీ ఉంది. బహుశా ఆ కారణంతో బిగ్ బాస్ అతన్ని ఎలిమినేట్ చేసి మళ్ళీ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చేలా చేస్తాడేమో అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

మరోపక్క గతవారం ఎలిమినేట్ అయిన బేబక్క,, ఈ వారం శేఖర్ బాషా (Shekar Basha) ఎలిమినేట్ అవుతాడు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఎందుకంటే అతను బాగానే ఆడుతున్నా.. అతను ఏ గ్రూప్ తోనూ ఉండటం లేదని, అందువల్ల అతను ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని ఆమె చెప్పింది. ఆమె ప్రెడిక్షన్ ఇప్పుడు నిజమవ్వడం చెప్పుకోదగ్గ విషయం.















