యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ లు హీరోలుగా ‘బాహుబలి'(సిరీస్) తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మరియు పాన్ ఇండియా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. 2018 అక్టోబర్ ఎండింగ్ లో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. సుమారు మూడున్నరేళ్ల తర్వాత ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అందుకు కరోనా లాంటి ఎన్నో కారణాలు ఉన్నాయనుకోండి. ఇక అన్ని అడ్డంకులను తొలగించుకుని జనవరి 7న ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు.. టీజర్, ట్రైలర్ వంటివి విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ప్రమోషన్లను కూడా వేగవంతం చేసాడు రాజమౌళి. హీరోలిద్దరినీ ముంబై, చెన్నై అంటూ తెగ తిప్పుతున్నాడు. ఇది పక్కన పెడితే.. ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న సంగతి తెలిసిందే. చరిత్రలో ఆ ఇద్దరు సూపర్ హీరోలు కలిసినట్టు లేదు. ఇద్దరు వేరు వేరు రాష్ట్రాలకు చెందిన వారు.అల్లూరి 1897 లో పుట్టి.. 1924 లో చనిపోయినట్టు,కొమరం భీమ్ 1901 లో పుట్టి 1940 లో చనిపోయినట్టు చరిత్ర చెబుతుంది.
అలాంటి హీరోలు కలిస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ ను తన మార్క్ డైరెక్షన్ తో ఫిక్షనల్ గా మాత్రమే చూపించబోతున్నాడు రాజమౌళి. అయితే క్లైమాక్స్ లో ఈ ఇద్దరు హీరోలు చనిపోతారా అనే డౌట్ అందరిలోనూ ఉంది. నిజానికి ఈ సినిమా కోసం రాజమౌళి 3 క్లైమాక్స్ లు చిత్రీకరించాడని ఇన్సైడ్ టాక్. అందులో ఒకటి ట్రాజెడీతో నిండి ఉంటుందని అంటున్నారు. అంటే ఇద్దరు హీరోలు చనిపోతారా? రాజమౌళి ధైర్యం చేసి ఆ క్లైమాక్స్ ను పెడతాడా? అనే అనుమానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.