ఎట్టకేలకు బయట పడ్డ ప‌వ‌న్‌, మ‌హేష్… నిర్మాతలు..!

పవర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ కు ‘ఖుషి’ లాంటి ఆల్ టైం హిట్టిచ్చిన డైరెక్టర్ ఎస్‌.జె.సూర్య… వీరిద్దరి కాంబినేష‌న్‌లో 2010లో `కొమరం పులి` అనే చిత్రం వచ్చింది. ఇక ఇదే ఏడాది మ‌హేష్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో `ఖ‌లేజా` చిత్రం కూడా వచ్చింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలాయి. అయితే ఈ రెండు చిత్రాలను నిర్మించింది ఒక్కరే. ఆయ‌నే శింగ‌న‌మ‌ల ర‌మేష్.

ఈ చిత్రాల వీడియో హ‌క్కుల విష‌యంలో శింగ‌న‌మ‌ల ర‌మేష్‌, సి.క‌ల్యాణ్ లు క‌లిసి భానుకిర‌ణ్‌తో త‌మ‌ని బెదిరించార‌ని షాలిమార్‌, యూనివ‌ర్స‌ల్ వీడియోస్ సంస్థ‌లు వీరి పై కేసులు నమోదు చేసారు. ఎట్టకేలకు ఈ కేసు నుండి శింగ‌న‌మ‌ల ర‌మేష్‌, సి.క‌ల్యాణ్‌, భానుకిర‌ణ్‌ల‌కు నాంప‌ల్లి సీఐడీ కోర్టు విముక్తినిచ్చింది. ఈ కేసు పై ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేస్తున్న‌ట్టు సీఐడీ కోర్టు ప్ర‌క‌టించినట్టు స్పష్టమవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus