గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎన్నో ప్రేమ పాటలకు ప్రాణం పోశారు. ఆయన జీవితంలోనూ ప్రేమకు పెద్ద స్థానమే వుంది. బాలూది ప్రేమ వివాహమే. తన దూరపు బంధువుల అమ్మాయి అయిన సావిత్రిని ఆయన ప్రేమించారు. పెద్దలు అంగీకరించకపోవడంతో వాళ్లకు తెలియకుండా మిత్రుల సహకారంతో పెళ్లి చేసుకున్నారు. సినీ ఫక్కీలో జరిగిన ప్రేమ, పెళ్లి వివరాల్లోకి వెళితే… బాలు మద్రాసు వెళ్ళినప్పుడు దూరపు బంధువులు అగస్తేశ్వరరావు గారింట్లో అద్దెకు వుండేవారు. ఆ అగస్తేశ్వరరావుగారి అమ్మాయే సావిత్రి.
గాయకుడిగా ప్రేమ పాటలు పడుతున్నప్పుడే సావిత్రితో బాలు ప్రేమలో పడ్డారు. పెద్దలకు విషయం చెప్పి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు బాలు. ఇద్దరిదీ ఒకే గోత్రం కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. పైగా, బాలూని ఇల్లు ఖాళీ చేయించారు అగస్తేశ్వరరావు. కుమార్తెను చెన్నై నుండి బెంగళూరు పంపించారు. అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. సావిత్రికి దూరం కావడంతో బాలు విరహ వేదనలో పడ్డారు. ఆయన పరిస్థితి చూసిన స్నేహితులు… బెంగళూరు నుండి సావిత్రిని తీసుకొచ్చారు.

బాలూని, ఆమెను సింహాచలం తీసుకువెళ్లి అప్పన్న సాక్షిగా పెళ్లి చేశారు. మూడు రోజుల తరవాత గానీ ఇంట్లో పెద్దలకు తెలియలేదట. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడంతో కొన్నాళ్ళు బాలు దంపతులతో పెద్దలు మాట్లాడలేదు. పిల్లలు పల్లవి, చరణ్ పుట్టిన తరవాత ఇరువైపులా సంబంధాలు క్రమక్రమంగా మెరుగుపడ్డాయి.
Most Recommended Video
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16
17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

67

68

69

70

71

72

73

74

75

76

77

78

79

80

