కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో నయనతార ముందుంటుంది. ఒక్కో సినిమాకి మూడు నుండి ఐదు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. ఆమె ఉంటే చాలు.. సినిమా హిట్ అవుతుందని నమ్మే దర్శకనిర్మాతలు చాలా మంది ఉన్నారు. హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇదిలా ఉండగా.. నయనతారని కొందరు రాజకీయనాయకులు టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తుంటారు.
రాధారవి అనే సీనియర్ నటుడు, రాజకీయనాయకుడు గతంలో ఆమె క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురయ్యాయి. ఇప్పుడు మరోసారి ఆయన నయనతారపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో హీరో ఉదయనిధి స్టాలిన్(డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు) ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. దాంతో ఉదయానిధిపై విమర్శలు ఎక్కుపెట్టింది బీజేపీ. ఉదయనిధిని టార్గెట్ చేస్తూ.. నయనతార పేరుని బయటకి లాగారు బీజేపీ నేత రాధారవి.
”ఉదయనిధికి, నయనతారకి ఎటువంటి సంబంధం ఉన్నా.. నాకు అనవసరం” అంటూనే వాళ్ల మధ్య ఏదో ఉందని అర్ధం వచ్చేలా మాట్లాడారు. ఇలా ఎన్నికల ప్రచారంలో ఉదయనిధిని టార్గెట్ చేయడానికి నయనతార పేరుని వాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతోన్న నయన్ పై ఇలాంటి చీప్ కామెంట్స్ చేస్తుంటే ఆమె అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా రాధారవిని టార్గెట్ చేస్తున్నారు. నయన్ త్వరలోనే తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కానీ ఆమెకి ఈ రకమైన పరిస్థితులు ఎదుర్కోవడం తప్పడం లేదు.