సెలబ్రిటీస్ ఎప్పుడూ అభిమానులకు ఆదర్శంగా ఉండాలి కానీ, యాంటీ ఫాన్స్ విమర్శలకు ఆహారంగా మారకూడదు. విషయం ఏమిటంటే….గత కొంతకాలంగా ఇండస్ట్రీలో బడా హీరోలపై కాస్త విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. దానికి కారణం వారి నోటి దురుసు తనమే. తాజాగా చిరు తన వర్గాన్ని వెనకోసుకు వస్తున్న క్రమంలో సమైఖ్యాంధ్ర ఉద్యమం రోజుల్లో మాటాడకుండా కులం కోసం మాట్లాడుతున్నారు అని నేటిజన్లు ఆయనపై విమర్శలు ఒక లెవెల్లొ గుప్పిస్తున్నారు.
ఇక మరో పక్క బాలయ్యపై కూడా అదే తరహా విమర్శలు వస్తున్నాయి…అవేవో కులం గురించి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే బాలయ్య ప్రవర్తన, విధానం వల్ల అలా జరుగుతుంది అని జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి…ఇంతకీ బాలయ్యను తెలంగాణా వాళ్ళు ఎందుకు విమర్శిస్తున్నారు అంటే…ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న నందమూరి బాలకృష్ణ తన వందవ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రానికి సంబంధించి ప్రచారం చేస్తున్న క్రమంలో తెలంగాణ వాసులపై నోరు జారారు.. తెలంగాణ వాళ్ళకు తెల్లన్నం తెలియదని తెలుగుదేశం పార్టీ వచ్చాకే వాళ్ళు తెల్లన్నం తింటున్నారని వ్యాఖ్యానించడం పెద్ద దుమారాన్నే లేపుతోంది.
దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులు ఒక్కసారీ కోపానికి గురయ్యారు. ఇక దీనిపై ఆన్‌లైన్ లో కామెంట్స్ వర్షం కురుస్తుంది. ఇక మరో పక్క తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది..ఈ సమయంలో బాలయ్య అలాంటి వ్యాఖ్యలు చేయడంపై తెలంగాణలో టీడీపీ పార్టీ పరువు ప్రతిష్ట మరింత దిగజారి పోవడం ఖాయమని టి టిడిపి నాయకులు బాధపడుతున్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన సంధర్భం సైతం ఉంది…అసలు బాలయ్య ఏ సంధర్భంలో అలా అన్నారు….ఆయన మాటల్లో అర్ధం ఏంటో అని…