ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పుడు ఇండియన్ లెవెల్లో స్టార్ డైరెక్టర్. తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసాడు. ‘బాహుబలి’ చిత్రాన్ని అందరూ ఓన్ చేసుకుని చూసారు… రాజమౌళి తరువాతి సినిమాలను కూడా అలాగే ఓన్ చేసుకుని చూస్తారు. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ పై కూడా అదే స్థాయిలో అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో రాజమౌళి ఇద్దరు స్వాతంత్ర్య సమరయోథుల జీవితాల్ని చూపించబోతున్నాడు. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అలాగే అల్లూరి సీతా రామరాజు పాత్ర కి చరణ్ ను ఎంచుకున్నాడు.
అయితే రాంచరణ్ కు ఎక్కువగా మాస్ హీరో అనే ముద్ర ఉంది.అయితే అల్లూరి పాత్రకు చరణ్ నే ఎందుకు తీసుకున్నాడు అనే కామెంట్స్ ఎక్కువ వినిపించాయి. నిజానికి ‘మగధీర’ చిత్రానికి 3 ఏళ్ళు ఎస్టిమేషన్ వేసుకున్నాడట రాజమౌళి. అయితే చరణ్ ఎనర్జీ వల్లే దానిని 2 ఏళ్ళ లోపు కంప్లీట్ చేయగలిగాడట. అందుకే ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి చారిత్రాత్మక చిత్రానికి అందులోనూ అల్లూరి పాత్రకు చరణ్ ను ఎంచుకున్నాడు అని తెలుస్తుంది.
ఇక చరణ్ కూడా పాన్ ఇండియా సినిమాలో నటించాలి .. అందులోనూ బాలీవుడ్ లో రాణించాలి అనే కోరిక బలంగా ఉందట. ‘జంజీర్’ చిత్రంతో అటెంప్ట్ చేసినా వర్కౌట్ కాలేదు. దీంతో రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ తో వర్కౌట్ అవుతుంది అని చరణ్ భావించి ఈ ప్రాజెక్ట్ కు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.