ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలోకి రీమేక్ చేయడం అనేది సర్వసాధారణమైన విషయం. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాని మరో భాషలోని ప్రేక్షకులకు అందించాలనుకోవడం మంచి పద్దతే..! అయితే ఈ రీమేక్ ల వ్యవహారం ఓటిటిలు ఊపందుకోనంత వరకు బాగానే ఉండేది. కానీ ఇప్పుడు రీమేక్ లకు అంతగా మన తెలుగు జనాలు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. లాక్ డౌన్ టైంలో పరభాషల్లో రూపొందిన సినిమాలను అదే పనిగా సబ్ టైటిల్స్ పెట్టి చూడటం అలవాటు చేసుకున్నారు. దాని ఒరిజినల్ లాంగ్వేజ్లో నటీనటుల ఒరిజినల్ వాయిస్ లలో సినిమాలు చూడటం కూడా అలవాటు చేసుకున్నారు. రీమేక్ లు పెద్ద హీరోలు చేస్తే తప్ప వాటి పై మినిమం బజ్ కూడా ఏర్పడటం లేదు.సరే వీటిని పక్కన పెట్టేస్తే.. కొన్ని పరభాషా సినిమాలు తెలుగులోకి డబ్ అయినప్పటికీ రీమేక్ చేసిన సందర్భాలు ఉన్నాయి.తాజాగా రిలీజ్ అయిన ‘గాడ్ ఫాదర్’ ఇందుకు నిదర్శనం.ఈ లిస్ట్ లో ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి.. అవేంటో ఓ లుక్కేయండి :
1) లీలామహల్ సెంటర్ :
ఆర్యన్ రాజేష్, సదా జంటగా నటించిన మూవీ ఇది. తమిళ సినిమా ‘అమర్కలం’ కి రీమేక్ గా తెరకెక్కింది. కానీ అంతకు ముందే ‘అద్భుతం’ పేరుతో తెలుగులోకి కూడా డబ్ అయ్యింది ఈ మూవీ.
2) నీ జతగా నేనుండాలి :
హిందీ మూవీ ‘ఆషీకి’ కి రీమేక్ గా తెరకెక్కింది. కానీ అప్పటికే తెలుగులో డబ్ అయ్యింది కూడా.
3) కాటమరాయుడు :
తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వీరం’ కి రీమేక్ గా తెరకెక్కిన మూవీ ఇది. అప్పటికే ‘వీరుడొక్కడే’ అనే పేరుతో తెలుగులో కూడా డబ్ అయ్యింది.
4) గద్దలకొండ గణేష్ :
తమిళంలో హిట్ అయిన ‘జిగర్తాండ’ కి రీమేక్ ఈ మూవీ. అప్పటికే ‘చిక్కడు దొరకడు’ అనే టైటిల్ తో డబ్ అయ్యింది కూడా..!
5) గాడ్ ఫాదర్ :
మలయాళంలో సూపర్ హిట్ ‘లూసీఫర్’ మూవీ అదే టైటిల్ తో తెలుగులోకి డబ్ అయ్యింది. అయినా మళ్ళీ ‘గాడ్ ఫాదర్’ గా రీమేక్ అవుతుంది.
6) ‘భోళా శంకర్’ :
‘ఆవేశం’ పేరుతో తెలుగులో డబ్ అయ్యింది. కానీ ఇప్పుడు చిరుతో ‘భోళా శంకర్’ గా రీమేక్ చేస్తున్నారు.
7) డియర్ మేఘ :
‘దియా’ అనే కన్నడ మూవీ అదే టైటిల్ తో తెలుగులోకి డబ్ అయ్యింది. కానీ మళ్ళీ రీమేక్ చేశారు.
8) తేరి రీమేక్ :
‘తేరి’ అనే తమిళ్ సినిమా తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ అవుతుంది. సుజీత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ‘పోలీస్’ అనే పేరుతో ఆల్రెడీ ఇది తెలుగులో డబ్ అయ్యింది.
9) ఎన్నై అరిందాల్ :
చిరంజీవి ఈ మూవీని తెలుగులోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇది ‘ఎంతవాడు గాని’ పేరుతో తెలుగులోకి ఆల్రెడీ డబ్ అయ్యింది.
10) మానాడు రీమేక్ :
ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ‘సురేష్ ప్రొడక్షన్స్’ సంస్థ ప్రయత్నిస్తుంది. అయితే ‘లూప్’ అనే పేరుతో ఇది తెలుగులో డబ్ అయ్యింది కూడా..! తెలుగు వెర్షన్ చాలా వరకు అందుబాటులోనే ఉండడం గమనార్హం.
11) వినోదయ సీతం రీమేక్:
తమిళ్ లో హిట్ అయిన ‘వినోదయ సీతం’ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ లతో రీమేక్ చేయనున్నారు. అయితే ఇది కూడా ఆల్రెడీ తెలుగులో డబ్ అయ్యింది. ‘జీ5’ లో తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది.