సినిమా ఇండస్ట్రీలో కథలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన మాటలు వినిపిస్తూ ఉంటాయి.. ఉదాహరణకి.. ఎవరికీ రాని ఓ అద్భుతమైన ఐడియా వస్తే దాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి.. పాత కథను చూసి స్ఫూర్తి పొందితే దాన్ని కొత్తగా చెప్పే ప్రయత్నం చేయాలి అంటుంటారు.. అలాంటి ఐడియాలజీ వల్లే దర్శకధీరుడు రాజమౌళి వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యారు.. మన తెలుగు పరిశ్రమలో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే ‘మాయాబజార్’, ‘పాతాళభైరవి’ లాంటి హిస్టారికల్ ఫిలింస్ వచ్చాయి.. గ్రాఫిక్స్ తెలియని కాలంలోనే వండర్స్ క్రియేట్ చేశారు..
మారుతున్న ట్రెండ్.. ప్రేక్షకుల ఆసక్తి.. అభిరుచులతో పాటు కథల్లోనూ కొత్త కొత్త జానర్స్ పుట్టుకొస్తుంటాయి.. ఒక్కోసారి వర్కౌట్ అవుతుంటాయి.. కొన్నిసార్లు ఫలితం అనుకున్నంతగా ఉండదు.. థియేటర్లలో ఆకట్టుకోని సినిమాలను కొద్ది రోజుల తర్వాత ఓటీటీ, టీవీ, యూట్యూబ్‌లోనో చూస్తున్నప్పుడు.. ఇంత బాగుంది.. ఎందుక ఫ్లాప్ అయింది అనిపిస్తుంది.. అలా, ఈ మధ్య కాలంలో డిఫరెంట్ పాయింట్‌తో తెరకెక్కి, అప్పుడు హాళ్లల్లో ప్రేక్షకుల తిరస్కారానికి గురై.. ఇప్పుడు చూస్తున్నప్పుడు సూపర్బ్ అనిపిస్తున్న కొన్ని సినిమాలేంటో చూద్దాం..
1: నేనొక్కడినే..
సూపర్ స్టార్ మహేష్ బాబు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్.. ‘1: నేనొక్కడినే’.. మహేష్ రాక్ స్టార్ గౌతమ్ క్యారెక్టర్‌లో డిఫరెంట్‌గా కనిపించాడు.. గౌతమ్‌కి మొదడుకి సంబంధించిన ఇంటిగ్రేషన్ డిజార్డర్ (గుర్తు పెట్టుకునే సామర్థ్యం తక్కువ) ఉంటుంది. చిన్నతనంలో తన తల్లిదండ్రులను చంపిన వ్యక్తులు ప్రపంచంలో ఏమూల ఉన్నా సరే.. వారిని వెతికి పట్టుకుని రివేంజ్ తీర్చుకోవడమనేది తన స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తో ఎంగేజింగ్‌గా చూపించారు సుకుమార్.. అర్థం కాక థియేటర్లో జనాలు తలలు పట్టుకున్నారు కానీ.. ఇప్పుడు చూసి.. మైండ్ గేమ్‌లా, మంచి పజిల్‌లా ఉంది అంటున్నారు.
ఐ (మనోహరుడు)..
చియాన్ విక్రమ్, సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ ‘అపరిచితుడు’ తర్వాత చేసిన సినిమా.. పాత్ర కోసం ప్రాణం పెట్టే విక్రమ్.. ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాడు.. మిస్టర్ ఇండియా పోటీల్లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న లింగేష్ (విక్రమ్) తన అభిమాన మోడల్ దియా (అమీ జాక్సన్) ని పరిచయం చేసుకోవడం.. ఆమె యాడ్స్ కోసం హెల్ప్ చేయడం.. అది తట్టుకోలేక దియా కో స్టార్ జాన్ (ఉపేన్ పటేల్), డాక్టర్ వాసుదేవ్ (సురేష్ గోపి), దియా పర్సనల్ స్టైలిస్ట్ ఓస్మా జాస్మిన్ (ఓజాస్ రజని),
యాడ్స్ ప్రొడ్యూసర్ ఇంద్ర కుమార్ (రామ్ కుమార్ గణేశన్) కలిసి లింగేష్‌ని జన్యుపరమైన వ్యాధికి గురిచేస్తారు. వాళ్ల మీద పగ తీర్చుకోవడంతో పాటు, దియాను వాళ్ల బారి నుండి ఎలా కాపాడాడు అనేది ఆసక్తి కరంగా చూపించారు శంకర్.. ‘అపరిచితుడు’ లాంటి భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు అప్పుడంతగా అనిపించలేదు కానీ ఇప్పుడు చూస్తే బాగానే ఉంది కదా అంటున్నారు..
సాహో..
రెబల్ స్టార్ ప్రభాస్.. ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్నప్పుడు వచ్చింది ‘సాహో’.. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ స్టైలిష్ యాక్షన్ ఫిలిం మేకింగ్ బాగుంటుంది. కథ, కథనాలు, విజువల్స్, మ్యూజిక్ ఆకట్టుకుంటాయి.. ‘బాహుబలి’ తర్వాత రావడంతో ఆ రేంజ్‌లో ఊహించుకున్నారు. రిజల్ట్ కాస్త తేడా కొట్టింది కానీ హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో ఉంటుంది.. ఓటీటీలో, టీవీలో చూస్తున్నప్పుడు బాగానే అనిపిస్తుంది..
కోబ్రా..
చియాన్ విక్రమ్ చేసిన మరో ఎక్స్‌పెర్‌మెంటల్ ఫిలిం ‘కోబ్రా’.. అజయ్ జ్ఞానముత్తు దర్శకుడు.. కధీర్, మది అనే రెండు పాత్రల్లో.. విభిన్నమైన గెటప్పుల్లో విక్రమ్ నటన ఆకట్టుకుంటుంది.. లెక్కల ఆధారంగా అతను వేసే ప్లాన్స్ భలే ఉంటాయి.. ఫస్ట్ హాఫ్ అదిరిపోతుంది కానీ సెకండాఫ్ విషయంలో ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు.. బాగుంది అనిపించినా కానీ ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకి పెద్దగా కనెక్ట్ కాలేదు. అయితే ఇటీవల ఓటీటీ స్ట్రీమింగ్‌లో మాత్రం అలరిస్తుంది..