బుల్లితెర ప్రేక్షకులను రోజురోజుకు ఎంతగానో ఆకట్టుకుంటూ అత్యధిక రేటింగ్ కైవసం చేసుకున్నటువంటి గుప్పడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే… విశ్వనాథన్ కు స్ట్రోక్ రావడంతో ఏంజెల్ ఏడుస్తూ తనకోసం జ్యూస్ కలుపుతూ ఉంటుంది అక్కడికి వెళ్లినటువంటి రిషి తనకు ధైర్యం చెబుతాడు.నాకు విశ్వనాథం తప్ప మరెవరు లేరు రిషి ఇప్పుడు తనకి ఏమైనా అయితే నేను తట్టుకోలేనని ఏంజెల్ ఏడుస్తూ ఉండగా తనకు ఏమి కాదు నువ్వు ఇలాగే ఏడుస్తూ ఉంటే సర్ కూడా బాధపడతారు అంటూ తనకు ధైర్యం చెబుతారు.
ఇక ఏంజెల్ జ్యూస్ తీసుకెళ్లి విశ్వంకిస్తుంది అనంతరం రిషి మాట్లాడుతూ నన్ను లీవ్ పెట్టి ఇక్కడే ఉండమంటావా ఏంజెల్ అని అడగడంతో వద్దులే రిషి ఏదైనా అవసరం ఉంటే నేను కాల్ చేస్తానని చెప్పడంతో రిషిక్ కాలేజ్ కి బయలుదేరుతాడు. కాలేజీలో వసుధార రిషి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సార్ ఏంటి ఇంకా రాలేదు..మరోసారి ఏమైనా సార్ పై ఏదైనా అటాక్ జరిగిందా అంటూ ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటుంది అంతలోపే క్లాస్ నుంచి బయటకు రావడంతో రిషి రావడం చూసి సంతోషపడుతుంది. వసుధారని చూసిన రిషి విశ్వనాథం గురించి వసుధారకు చెప్పాలా వద్దా అంటూ ఆలోచిస్తూ తనకు ఈగో అడ్డు రావడంతో చెప్పకుండా వెళ్ళిపోతాడు.
ఏంజెల్ మాత్రం వసుధారకు ఫోన్ చేసి విశ్వనాథంకు స్ట్రోక్ వచ్చిన విషయం చెప్పడంతో వసుధర కంగారుపడుతుంది. ఏంజెల్ నువ్వేమి కంగారు పడకు నేను ఇప్పుడే వస్తానని తనకు ధైర్యం చెప్పగా వద్దు వసుధార నువ్వు ఇప్పుడు రావద్దు క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాతేరా లేకపోతే రిషి విశ్వం ఇద్దరు కూడా అరుస్తారు. సాయంత్రం రిషి వస్తాడు కదా అప్పుడు తనతో పాటు ఇక్కడికి రా వసుధార అంటూ చెబుతుంది. మరోవైపు ఏంజెల్ రిషికి ఫోన్ చేసి సాయంత్రం నీతో పాటు వసుధారను కూడా ఇక్కడికే తీసుకురా రిషి అని చెబుతుంది. చక్రపానికి ఫోన్ చేసి వసుధార విశ్వనాథం పరిస్థితి గురించి తెలియజేసే నేను అక్కడికే వెళ్తాను నాన్న అని తన తండ్రికి చెబుతుంది.
సాయంత్రం కాలేజీ పూర్తి కాగానే వసుధార నడుచుకుంటూ వెళ్తూ ఉండగా రిషి మాత్రం తన పక్కన కారు ఆపుతాడు. వసుధార మాత్రం తాను ఎక్కమంటేనే ఎక్కుతానని కాస్త ఆటిట్యూడ్ చూపిస్తుంది. కారు తన పక్కన ఆగిన ఎక్కొచ్చు కదా అంటూ మనసులో అనుకొని కారు ఆపింది మీకోసం అంటూ వెటకారంగా మాట్లాడతారు దాంతో వసుధర మరెవరి కోసమైనా అనుకున్నానేమో అంటూ మాట్లాడుతుంది. తాను ముందు సీట్లో కూర్చోవడానికి వెళ్లగా రిషి మాత్రం వెనక కూర్చోమని చెబుతాడు. కారెక్కిన తర్వాత విశ్వనాథం పరిస్థితి చెప్పి ఏంజెల్ కు జాగ్రత్తలు చెప్పండి మేడం అనడంతో అంతేనా ఇంకా ఏమైనా చెప్పాలా అంటూ వసు మాట్లాడుతుంది.
ఇంటికి వెళ్ళగానే విశ్వనాథం వద్దకు వెళ్లి వసుధర చాలా ధైర్యం చెబుతుంది. నువ్వు కూడా ఇక్కడే ఉండిపో వసుధార అనడంతో రిషి మాత్రం అవసరం లేదు. పనిమనిషిని పెట్టాను మేడమ్ గారికి కూడా ఇంట్లో ఏవైనా పనులు అవి ఉంటాయి కదా అంటూ రిషి మాట్లాడతారు. ఇక వసుధార చేసేదేమిలేక తాను వెళ్తానని చెప్పగా కిచెన్ లో ఏంజెల్ ఉండడంతో అక్కడికి వెళుతుంది తాను వెళ్తానని చెప్పడంతో ఏంజెల్ ఇక్కడే ఉండిపో వసుధార నాకు కాస్త ధైర్యంగా ఉన్నట్టు ఉంటుందని చెప్పడంతో తన మాట కాదనలేక ఉండిపోతుంది.
ఇక వీరిద్దరూ జ్యూస్ కాఫీ తీసుకొని బయటకు వస్తారు జ్యూస్ ఏంజెల్ విశ్వనాథంకి ఇచ్చి నేను విశ్వంకి టాబ్లెట్స్ వేస్తాను నువ్వు కాఫీ తీసుకెళ్లి రిషికి ఇవ్వు వసుధారా అంటుంది. కాస్త భయంగానే వసుధర రిషి గదికి వెళ్లి తనకు కాఫీ ఇస్తుంది.రిషి గదిలోని వసుధార నిలబడటంతో ఏంటి అని రిషి అడగగా మీరు ఒకసారి మహేంద్ర సార్ కి ఫోన్ చేసి మాట్లాడండి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పడంతో ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు అని మాట్లాడతారు. మీకు అన్ని తెలుసు కానీ నేను మాత్రం అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటానని వసుధార మాట్లాడుతుంది.