సోషల్ మీడియా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) (అండ్ టీమ్) చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన గురించి ఎవరు మెసేజ్ చేసినా రిప్లైలు (దాదాపుగా) ఇస్తూ ఉంటారు. అలా విజయ్ ఇటీవల ఓ సీనియర్ నెటిజన్‌కి ఇచ్చిన రిప్లైకి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానికి కారణం విజయ్‌కి వచ్చిన వీడియో, ఆ వీడియో పంపిన ఆంటీకి ఆయన ఇచ్చిన లవబుల్ రిప్లైనే. మీరు చూసినా కూడా విజయ్ (అండ్ టీమ్) భలే రిప్లై ఇచ్చారు అనిపిస్తోంది.
హీరోలు – ఫ్యాన్స్.. ఈ రిలేషన్ ఒక్కో హీరోతో ఒక్కోలా ఉంటుంది. అలా విజయ్ దేవరకొండ అభిమానం కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. అలాంటి విజయ్‌కి ఓ పెద్దావిడ పర్సనల్ మెసేజ్‌గా ఓ వీడియోను పంపించారు. సోషల్ మీడియాలో ఆమెకు కనిపించిన వీడియో.. విజయ్‌కి బాగా ఉపయోగడపడుతుంది అని పంపించారట. ఆ వీడియో చూసిన విజయ్.. థాంక్యూ ఆంటీ.. మీక్కూడా ఇలాంటి ఫన్నీ, ఇంట్రెస్టింగ్ రీల్స్‌ను పంపిస్తాను అని రిప్లై ఇచ్చాడు.
ఈ మొత్తం వ్యవహారాన్ని ఆ పెద్దావిడకు సంబంధించిన వాళ్లెవరో సోషల్ మీడియాలో ఓ వీడియోగా షేర్ చేశారు. అదే ఇప్పుడు వైరల్‌గా మారి విజయ్ అభిమానం ఎలా ఉంటుందో తెలుపుతోంది. ఇక ఆ వీడియోలో ఏముందో చూస్తే.. ఆ రీల్‌ను విజయ్ దేవరకొండకు ఎందుకు పంపావ్ అని ఆ పెద్దావిడకు సంబంధించిన వాళ్లెవరో అడిగారు.
దానికి ఆమె నవ్వేసి ఊరుకుంది. అయితే పక్కనుండి విజయ్‌కి బట్టల షాపు ఉంది కదా పనికొస్తుందని పంపించిందట అని చెప్పారు. దీంతో అందరూ నవ్వేశారు ఆ వీడియోలో. ఇదంతా ఆమె పంపినన వీడియో ఏంటి అనేగా మీ డౌట్. బట్టలు ఫ్రీగా కుట్టే చోటు, ఫ్రీగా ఆల్ట్రేషన్ చేయించే చోటుని ప్రమోట్ ఓ నెటిజన్ రీల్ చేశాడు. ఆ వీడియోను విజయ్‌కి ఆ పెద్దావిడ పంపించారు.