విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) , రష్మిక మందన్న (Rashmika Mandanna) మధ్య ఉన్న అనుబంధం గురించి చర్చలు ఎప్పటికీ తగ్గడం లేదు. సినిమాల్లో కలిసి నటించినప్పటి నుంచే వీరి మధ్య ప్రత్యేకమైన రిలేషన్‌షిప్ ఉందని పుకార్లు వస్తున్నాయి. ‘గీత గోవిందం,’ (Geetha Govindam) ‘డియర్ కామ్రేడ్’ (Dear Comrade) వంటి చిత్రాలు వీరి కెమిస్ట్రీని ప్రేక్షకులకు చూపించగా, ఆ సాన్నిహిత్యం రియల్ లైఫ్‌లో కొనసాగుతోందనే వార్తలు ఎక్కువయ్యాయి. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌లో రష్మిక తన వ్యక్తిగత జీవితం గురించి అనుకూల వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
Vijay, Rashmika:
“మీ ప్రియుడు ఎవరు?” అనే ప్రశ్నకు “అందరికీ తెలిసిన విషయమే కదా” అని సమాధానం ఇచ్చింది. ఇది రష్మిక తన రిలేషన్‌షిప్ పై క్లారిటీ ఇచ్చినట్లుగా ఫీలవుతున్నారు. అయితే ఆమె విజయ్ పేరును ఏ దశలోనూ ప్రస్తావించలేదు. ఇక రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో ఇద్దరు ఒకరి తరువాత ఒకరు వెంటవెంటనే కనిపించడంతో మళ్ళీ రూమర్స్ వైరల్ గా మారాయి. క్రిస్టమస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఇద్దరు హాలిడేస్ కు వెళుతున్నట్లు రకరకాల గాసిప్స్ వస్తున్నాయి.
ఇక ఈ విషయంలో ఎన్ని రూమర్స్ వస్తున్నా కూడా వారు పట్టనట్లే ఉంటున్నారు. మరోవైపు విజయ్ తన మ్యూజిక్ ఆల్బమ్ ప్రమోషన్ సందర్భంగా, తాను సింగిల్ కాదని, ఒకరి తో రిలేషన్‌లో ఉన్నానని ఓపెన్‌గా చెప్పాడు. ఇది రష్మిక వైపు ఫోకస్ పెరిగేలా సంకేతాలు ఇచ్చిందని నెటిజన్లు భావిస్తున్నారు. విజయ్ తండ్రి గోవర్ధన్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో, “విజయ్ సినిమాల మీదే ఫోకస్ చేస్తాడుప్. పెళ్లి ఇప్పట్లో ఉండదు,” అని క్లారిటీ ఇచ్చారు.
ఇక తాజాగా వీరిద్దరూ హాలిడేలకు వెళ్లడం, ఒకే లొకేషన్‌లో ఫోటోలు షేర్ చేయడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. విజయ్ తన సినిమాలతో బిజీగా ఉంటూనే, రష్మిక (Rashmika) కూడా వరుస ప్రాజెక్ట్‌లతో ముందుకెళ్తోంది. ‘పుష్ప 2’తో (Pushpa 2: The Rule) బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మికకు, ‘కుబేర,’ (Kubera) ‘ది గర్ల్ ఫ్రెండ్,’ ‘చావా’ (Chhaava) వంటి చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. విజయ్ కూడా గౌతమ్ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) , రాహుల్ సంకృత్యాన్ ( Rahul Sankrityan) సినిమాలతో బిజీగా ఉన్నాడు.