‘వినయ విధేయ రామా’ సినిమాను మరచిపోవడం టాలీవుడ్‌లో ఇద్దరు అస్సలు మరచిపోరు. ఒకరు రామ్‌చరణ్ అయితే, ఇంకొకరు ఆయన అభిమానులు. ఆ రేంజిలో ఉంటాయి మరి అందులో యాక్షన్ సీన్స్. నిర్మాతకు వచ్చిన లాభనష్టాల సంగతి పక్కపెడితే… ఆ సినిమా విడుదలయ్యాక వచ్చిన ట్రోల్స్, మీమ్స్ సంగతైతే లెక్కే లేదు. అన్నింటికీ కారణం ఆ సినిమాలో యాక్షన్ సీన్స్. అప్పటివరకు ‘రెడీ బాబూ’ అంటూ మాస్ సినిమా చూపిస్తూ వచ్చిన బోయపాటి శ్రీనివాస్ అందులో రెచ్చిపోయాడు. మానవ మాతృడికి సాధ్యం కాని ఫైట్స్, యాక్షన్ సీన్లు చూపించాడు. మరి బాలయ్య సినిమా పరిస్థితి ఏంటి అనే డౌట్ మామూలుగానే వస్తుంది. దీనిపై చిత్రబృందం పక్కా ప్లాన్‌తో సిద్ధమైందట.
‘వినయ విధేయ రామ’ను నవ్వులపాటు చేసిన ‘తల నరికితే పక్షి ఎత్తుకు వెళ్లడం’, ‘రైళ్లు మీద దూకి ఎక్కడి నుండో ఎక్కడికో వెళ్లడం’ లాంటి సీన్స్‌కు ‘బిబి3’ (వర్కింగ్ టైటిల్)లో అస్సలు చోటు లేదంట. బాలయ్యతో హ్యాట్రిక్ కొడదామని ముందుకొచ్చిన బోయపాటి అండ్ టీమ్… చాలా జాగ్రత్తగా ఉందని టాక్. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌లో యాక్షన్ సీన్స్ కొన్ని చూపించారు. వాటిలో ఎక్కడా అతి లేకపోవడం మనకు తెలిసిందే. సినిమా మొత్తంలో ఇలాంటి సీన్స్ లేకుండా మంచి యాక్షన్ చూపిద్దామని అనుకుంటున్నారట.
మరోవైపు బాలయ్య సినిమాల్లో అతి సన్నివేశాల గురించి ఆయనే చాలా సార్లు స్పందించారు. ‘అప్పుడు అలా ఎందుకు చేశానో నాకే తెలియదు’ అంటూ ‘పలనాటి బ్రహ్మనాయుడు’ గురించి చాలా సార్లు చెప్పారు బాలయ్య. అయితే ఆ సినిమా తర్వాత బాలయ్య ఆ రేంజ్ ఓవర్ యాక్షన్ సీన్స్ చేయలేదు. ఇప్పుడు ‘వివిఆర్’ ఎఫెక్ట్‌తో బోయపాటి కూడా సెట్‌రైట్ అయ్యారన్నమాట. ఏదైతేముంది బాలయ్యతో మంచి సినిమా తీసి హ్యాట్రిక్ కొట్టడం మనకు కావాలి. ‘జై బాలయ్య’ అని అభిమాని థియేటర్‌లో అరవాలి.