వచ్చేస్తున్నాం.. వచ్చేస్తున్నాం అంటూ గత కొన్ని రోజులుగా ఊరించిన ‘విదా మయూర్చి’ సినిమా టీమ్ ఆఖరి సమయానికి వచ్చేసరికి ‘తూచ్ మేం రాం’ అని చేతులెత్తేసింది. దాని వెనుక చాలా విసయాలు ఉన్నాయి అని కోడంబాక్కం వర్గాల మాట. ఆ విషయాలేమో కానీ ఆ సినిమా రాకపోవడం వల్ల పుష్కర కాలం నాటి ఓ పాత సినిమా ఎట్టకేలకు విడుదలకు నోచుకుంటోంది అని అంటున్నారు. అదే ‘మద గజ రాజా’. ఏంటీ ఈ సినిమా రీరిలీజ్ చేస్తున్నారా అని అనొద్దు. ఎందుకంటే ఇది ఫస్ట్ రిలీజే.
Vishal
విశాల్ (Vishal) హీరోగా సుందర్.సి (Sundar C) తెరకెక్కించిన చిత్రం ‘మదగజరాజా’ 2012లో ఈ సినిమా మొదలైంది. సగటు విశాల్ సినిమాలనే ఏడాదికే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ వివిధ కారణాల వల్ల సినిమా విడుదల కాలేదు. మధ్యలో ఒకటి రెండుసార్లు ప్రయత్నం జరిగినా సినిమాను రిలీజ్ చేయలేకపోయారు. విశాల్ మంచి జోరు మీదున్నప్పుడే ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోవడం గమనార్హం. కానీ ఇప్పుడు తెస్తామంటున్నారు
‘విదా మయూర్చి’ తప్పుకోవడంతో తమిళనాట ఈ పొంగల్ సీజన్ ఏ సినిమా లేకుండా ముగిసిపోవాలా అనే మాట వినిపిస్తున్న నేపథ్యంలో ‘మద గజ రాజా’ వస్తుంది అని చెబుతున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar), అంజలి (Anjali) హీరోయిన్లుగా నటించగా.. సంతానం ఓ కీలక పాత్రలో నటించాడు. అన్నింటికి మించి ‘బాక్: అరణ్మయి 4’ (Baak) సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన సుందర్ తీసిన సినిమా కావడం ప్రచారానికి భలే ప్లస్.
అన్నట్లు ఈ సినిమా రిలీజ్ సమస్యే కాదు. చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి అంటారు. తొలుత హీరోయిన్ల పాత్రల కోసం శ్రుతి హాసన్ (Shruti Haasan) , హన్సిక (Hansika Motwani), కార్తిక (Karthika Nair), తాప్సి (Taapsee Pannu) పేర్లు వినిపించాయి. ఫైనల్‌గా వరలక్ష్మి, అంజలి ఓకే అయ్యారు. ఇక ఈ సినిమాలో ధనుష్ (Dhanush) మూడు పాత్రల్లో కనిపిస్తాడని టాక్ వచ్చినా.. అదేమీ లేదని చెప్పారు. జనవరి 14, 2013న వస్తుందని చెప్పిన ఈ సినిమా జనవరి 12, 2025కి రావొచ్చని టాక్.