బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుని మంచి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకు మరింత ఆదరణ పొందుతుంది. ఇప్పుడిప్పుడే రిషి తన వారి గురించి ఆలోచించడం మొదలు పెట్టడంతో ఈ సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది. మరి నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే…రిషికి మెలకువ వచ్చి అసలు నేనెక్కడున్నాను ఏం జరిగిందని అడుగుతారు. దాంతో మహేంద్ర మనం వసుధార ఇంట్లో ఉన్నామని చెప్పగానే రిషి ఒక్కసారిగా పైకి లేసి తాను ఇక్కడి నుంచి వెళ్లిపోతానని చెబుతాడు.
దాంతోమహేంద్ర నువ్వు ఇక్కడ అయితే క్షేమంగా ఉంటావని తెలిసి ఇక్కడికే తీసుకొచ్చాము అని చెప్పడంతో రిషి మాత్రం వసుధర కావాలని ఇలా చేసి తనకు దగ్గరవుతుందన్నట్టు మాట్లాడి తనని బాధపడతారు. వసుధార గురించి రిషి తప్పుగా ఆలోచిస్తూ మాట్లాడటంతో విశ్వనాథం గారికి ఇవన్నీ తెలిస్తే ఆయన భయపడతారని ఇక్కడికి తీసుకు వచ్చాము అంతేకానీ మరో ఉద్దేశం లేదని చెబుతుంది. అవన్నీ నాకు అనవసరం నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను మీరు నాతో వస్తారా రారా డాడ్ అంటూ వెళ్ళిపోతారు. అదే సమయంలోనే మీ అమ్మాయికి కృతజ్ఞతలు చెప్పండి అంటూ చక్రపాణి గారికి చెప్పి వెళ్ళిపోతారు.
మరోవైపు చాలా ఆలస్యమైన ఇంటికి రిషి రాకపోవడంతో ఏంజెల్ విశ్వనాథం కంగారుపడుతూ ఉంటారు. అంతలోపు మహేంద్ర రిషి ఇద్దరు కలిసి రావడంతో విశ్వనాథం షాక్ అవుతారు. ఏమైంది రిషి ఇంత ఆలస్యమైంది అని ఏంజెల్ అడగడంతో మహేంద్ర రిషి పై జరిగిన అటాక్ గురించి చెప్పడంతో ఏంజెల్ విశ్వనాథం షాక్ అవుతారు. రిషి ఎవరికి ఎలాంటి ద్రోహం తలపెట్టేవాడు కాదు తనపై ఎవరు అటాక్ చేస్తారు అంటూ విశ్వనాథం అనడంతో మంచివాళ్ళకు ఈ రోజుల్లో శత్రువులు ఎక్కువగా ఉంటారు కదా సార్ అని మహేంద్ర చెబుతాడు.
ఆ మాటలకు విశ్వనాథం మాట్లాడుతూ నాకు తెలిసి నీ గతమే నిన్ను ఇలా వెంటాడుతుంని చెబుతాడు. ఆరోజు నీపై వీళ్లే అటాక్ చేసి ఉంటారు అని ఏంజెల్ చెప్పడంతో అవునమ్మా మొన్న మీ ఇంట్లో కూడా రిషి పై అటాక్ జరిగింది అని మహేంద్ర చెప్పడంతో ఏంజెల్ విశ్వనాథం షాక్ అవుతారు. మా ఇంట్లో అటాక్ జరగడం ఏంటి అని అడగడంతో అవునని చెప్పగా ఈ విషయం నాతో చెబితే సెక్యూరిటీ టైట్ చేసే వాడిని కదా రిషి అనీ విశ్వనాథం మాట్లాడుతారు.
అలాంటిదేమీ వద్దు సార్ అంటూ రిషి చెబుతారు. గతం గురించి అడిగితే రిషి చెప్పడం లేదు మీకు తెలిసే ఉంటుంది కదా అని మహేంద్రని విశ్వనాథం అడగడంతో చెప్పాల్సినది అయితే తనే చెబుతారు కదా అంటూ మహేంద్ర చెబుతారు. మరోవైపు రిషి మహేంద్ర ఇద్దరూ గదిలోకి వెళ్తారు అక్కడ మహేంద్ర ఒడిలో రిషి తల పెట్టుకుని బాధపడుతూ ఉంటారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఒకప్పుడు ఎంత సంతోషంగా ఉండే వాళ్ళం అన్నయ్య పెద్దమ్మ పెదనాన్న ప్రేమతో ఎంతో సంతోషంగా ఉండే వాళ్ళం మరి ఆ రోజులు తిరిగి వస్తాయా డాడ్ అని బాధపడతారు. నీ పరిస్థితి ఇలా కావడానికి కారణం మీ పెద్దమ్మ అని నేను చెప్పలేకపోతున్నాను.
నీ పరిస్థితి ఇలా కావడానికి కారణం మీ పెద్దమ్మ అని తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అందుకే ఏం చెప్పలేకపోతున్నానని మనసులో అనుకుంటాడు ఎలాగైనా మరి ఆ సంతోషాన్ని తీసుకువస్తానని మనసులో అనుకుంటాడు. చిన్నప్పటినుంచి నాకు తల్లి విలువ తల్లి ప్రేమ తెలియదు అది తెలిసి అమ్మ ఒడిలో పడుకొని ఎన్నో కబుర్లు చెప్పాలనుకున్నాను కానీ ఆ గురు శిష్యులు నాపై నిందలు వేసేసరికి భరించలేకపోయాను అంటూ బాధపడతారు. మరోవైపు వసుధర రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది దాంతో మహేంద్ర కు ఫోన్ చేసి ఎలా ఉంది సర్ అని అడగడంతో ఇప్పుడే నీ గురించి జగతి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ నిద్రపోయారని మహేంద్ర చెబుతారు.