అంతా బాగానే ఉంది.. స్టార్ హీరోలందరూ సినిమాల లైనప్‌ను ఫిక్స్ చేసేసుకున్నారు. వరుస సినిమాల చిత్రీకరణలు జరుగుతున్నాయి అని టాలీవుడ్ ఫ్యాన్స్ అనుకుంటుండగా.. ఓ వార్త వచ్చి మొత్తం పరిస్థితిని మార్చేసేలా కనిపిస్తోంది. అది కూడా ఓ దర్శకుడు ఇటీవల స్టార్ హీరోకు కథ చెప్పి, దాదాపు ఒప్పించేశారు అని వార్త వచ్చిన తర్వాతనే. ఆ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాగా (Sandeep Reddy Vanga) కాగా.. ఆ స్టార్ హీరో రామ్‌చరణ్ (Ram Charan). మెగా అభిమాని అయిన సందీప్ రెడ్డి వంగా ఇటీవల చరణ్‌ను (Ram Charan) కలసి ఓ కథ లైన్ చెప్పారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
కథ చెబితే ఏముంది చరణ్ లైనప్ మాత్రమే మారుతుంది కదా అని మీరు అనొచ్చు. మీరు అన్నది కరెక్టే కానీ.. అక్కడ సందీప్ రెడ్డి వంగా లైనప్ కూడా మారుతుంది. అలా చరణ్‌తో నెక్స్ట్‌సినిమాలు చేయాలి అనుకుంటున్న వారి లైనప్‌లు మారతాయి. దాని వల్ల ఆ దర్శకులతో సినిమాలు ఓకే చేసుకున్న మిగిలిన హీరోల లైనప్‌లు కూడా మారుతాయి. అందుకే ఒక్క కాంబో లైనప్ మొత్తంగా పరిస్థితిని షేక్ చేసే పరిస్థితికి తీసుకొచ్చింది.
విషయం ఏంటంటే.. బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) ‘పెద్ది’ (Peddi) సినిమా తర్వాత రామ్‌చరణ్ – సుకుమార్ (Sukumar) కాంబోలో సినిమా స్టార్ట్ అవ్వాల్సి ఉంది. ఆ సినిమాకు దాదాపు అన్నీ సిద్ధమే. చరణ్ ఇంట్రో సీన్ కూడా షూట్ చేశారు. దాంతోనే సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని మనకు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమాకు ముందే చరణ్ – సందీప్ వంగా సినిమా చేస్తారు అని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల లైనప్‌లు మారుతాయి అనేదే ఇక్కడ పాయింట్.
ఎందుకంటే సందీప్ వంగా నెక్స్ట్ ప్రభాస్ (Prabhas) ‘స్పిరిట్’ (Spirit) స్టార్ట్ చేయాలి. కానీ ప్రభాస్ ఇప్పుడు కొత్త సినిమా స్టార్ట్ చేయలేని పరిస్థితి. దీంతో ‘యానిమల్’ (Animal) సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ ఎప్పుడు అనేది తేలడం లేదు. ఆ రెండు పూర్తయితే అల్లు అర్జున్‌తో (Allu Arjun) సినిమా చేయాల్సి ఉంది సందీప్ వంగా. ఇప్పుడు బన్నీ సినిమా లైనప్ డిస్ట్రబ్ అయితే అక్కడ త్రివిక్రమ్ (Trivikram) లైనప్ మారుతుంది. చరణ్ సినిమా మారితే సుకుమార్ లైనప్ కూడా ఛేంజ్ అవుతుంది.
సుకుమార్ – అల్లు అర్జున్ నుండి ‘పుష్ప 3’ ఇంకా బాకీ ఉంది. మరి అదెప్పుడు అవుతుందో చూడాలి. ఇక త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయాలని తారక్ చాలా ఏళ్లుగా ప్లాన్స్ చేస్తున్నాడు. బన్నీ సినిమా లేట్ అయితే తారక్ సినిమా ఆశ వాయిదా వేసుకోవాలి. ఇక ప్రభాస్ – సందీప్ ‘స్పిరిట్’ సినిమా లేట్ అయితే లోకేశ్ కనగరాజ్‌తో ప్రభాస్ చేస్తాడంటున్న సినిమా ఆలస్యం అవుతుంది. అది జరిగితే రామ్‌చరణ్ (Ram Charan) – లోకేశ్ (Lokesh Kanagaraj) సినిమా కూడా ఆలస్యం. ఇన్ని ఆలస్యాలకు కారణమైన రామ్‌చరణ్ – సందీప్ రెడ్డి వంగా సినిమా ఉంటుందా?