టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి ఏ సినిమాను తెరకెక్కించినా ఆ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాల విజయాలతో దర్శకునిగా రాజమౌళి స్థాయి కూడా పెరిగింది. మహేష్ రాజమౌళి కాంబో మూవీకి సంబంధించి కథ కూడా ఫైనల్ కాకపోయినా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద క్రియేట్ అయిన రికార్డులు ఈ సినిమాతో బ్రేక్ అవుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అయితే రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న బ్రహ్మాస్త్ర సౌత్ భాషలలో కూడా రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటూ రాజమౌళి సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. అయితే రాజమౌళి క్రేజ్ తో ఈ సినిమా హిట్టవుతుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సాధారణంగా బాలీవుడ్ సినిమాలకు హిట్ టాక్ వచ్చినా సౌత్ లో ఈ సినిమాలు సక్సెస్ సాధించడం సులువు కాదు.
రాజమౌళి సపోర్ట్ ఉన్నా కథ, కథనం, ఎమోషన్స్ ప్రేక్షకులను మెప్పించే విధంగా లేని పక్షంలో సినిమా సక్సెస్ సాధించడం మాత్రం కష్టమనే సంగతి తెలిసిందే. సౌత్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేయడమే లక్ష్యంగా భారీ బడ్జెట్ తో బ్రహ్మాస్త్ర సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. రణబీర్ కపూర్, అలియా భట్ ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
కరణ్ జోహార్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా కరణ్ జోహార్ కోరిక మేరకు రాజమౌళి ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సౌత్ మార్కెట్ పై దృష్టి పెట్టగా యశ్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది.