‘హను-మాన్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయ్యింది. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ‘ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించారు. విడుదలకు ముందు నుండే ఈ సినిమా.. భారీ హైప్ ను సొంతం చేసుకుంది. టీజర్, ట్రైలర్..లు చూసి ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యారని చెప్పాలి. పోటీగా మహేష్ బాబు- త్రివిక్రమ్..ల ‘గుంటూరు కారం’ సినిమా ఉన్నప్పటికీ.. ‘హను-మాన్’ టీం ఏమాత్రం భయపడలేదు.
ముందు నుండి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. థియేటర్లు తక్కువైనా వారు టెన్షన్ పడింది లేదు. కచ్చితంగా మా సినిమా లాంగ్ రన్ నిలబడుతుంది అనే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. ఫైనల్ గా వారి నమ్మకమే నిజమైంది. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న ‘హను-మాన్’.. రోజు రోజుకీ స్క్రీన్స్ పెంచుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పటికీ ‘హనుమాన్’ జోరు తగ్గలేదు. తాజాగా ఈ సినిమా రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ ను అధిగమించింది.
షేర్ కూడా రూ.100 కోట్లు దాటేసింది. ఇప్పటివరకు రూ.70 కోట్ల లాభాలను అందించింది. ఆ రకంగా మొదటి సినిమాతోనే ‘హను-మాన్’ నిర్మాత కె.నిరంజన్ రెడ్డి జాక్ పాట్ కొట్టేశాడు అని అంతా అనుకుంటున్నారు. కానీ అతనికి ఈ లాభాల్లో ఒక్క రూపాయి కూడా రాదు అని ఇన్సైడ్ టాక్. ఎందుకంటే ముందుగానే ‘హను-మాన్’ (Hanu Man) సినిమా థియేట్రికల్ రైట్స్(తెలుగు) ను ‘మైత్రి డిస్ట్రిబ్యూషన్’ సంస్థకి హోల్ సేల్ గా అమ్మేశాడు.
హిందీ వెర్షన్ విషయంలో కూడా అదే చేశాడట నిరంజన్ రెడ్డి. అందుకే అతనికి లాభాల్లో వాటా రాదు. అయితే పెట్టిన బడ్జెట్ కి.. ‘హను -మాన్’ సినిమా విడుదలకి ముందే అతనికి లాభాలు పంచింది. ఒకవేళ ఓన్ రిలీజ్ చేసుకునే ఛాన్స్ ఉంటే, అతనికి ఇంకా లాభాలు వచ్చి ఉండేవి. ఇక ‘హను-మాన్’ కి ఇంకో వారం రోజులు క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఈ సినిమా ఇంకో రూ.50 కోట్ల నుండి రూ.100 కోట్లు గ్రాస్ ను రాబట్టే అవకాశాలు ఉన్నాయనేది ట్రేడ్ పండితుల సమాచారం.